AP Inter Results Provisional Marks Memo 2024: ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు(AP Inter Results 2024) వచ్చేసిన సంగతి తెలిసిందే. ఒకేసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ తో పాటు ఒకేషనల్ కోర్సుల ఫలితాలను కూడా ప్రకటించింది ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు. కేవలం 22 రోజుల వ్యవధిలోనే స్పాట్ పూర్తి చేయటంతో సహా ఫలితాలను వెబ్ సైట్ లో ఉంచింది. మరోవైపు సప్లిమెంటరీ పరీక్షల తేదీలను కూడా ప్రకటించింది. ఏప్రిల్ 24వ తేదీ లోపు సప్లిమెంటరీ ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే… షార్ట్ మెమోలకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది ఇంటర్ బోర్డు. విద్యార్థుల షార్ట్ మెమోలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. వీటిని విద్యార్థులు… డౌన్లోడ్ చేసుకోవచ్చు.
AP Inter Supplementary Exams 2024: ఏప్రిల్ 18వ తేదీ నుంచి విద్యార్థులు సప్లిమెంటరీ ఫీజు చెల్లించవచ్చని ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. ప్రిల్ 24వ తేదీని తుది గడువుగా ప్రకటించింది. ఇక రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోరే విద్యార్థులు కూడా ఈ తేదీల్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షలు(AP Inter Exams 2024) రాసిన ఫలితాలను హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో కూడా చెక్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఇక్కడ చూడండి…