TS Inter SSC Results 2024 : టీఎస్ ఇంటర్, టెన్త్ ఫలితాలపై అప్డేట్- ఈ తేదీల్లో రిజల్ట్స్ విడుదల?-hyderabad ts inter and ssc results 2024 updates expected date time in april may ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Inter Ssc Results 2024 : టీఎస్ ఇంటర్, టెన్త్ ఫలితాలపై అప్డేట్- ఈ తేదీల్లో రిజల్ట్స్ విడుదల?

TS Inter SSC Results 2024 : టీఎస్ ఇంటర్, టెన్త్ ఫలితాలపై అప్డేట్- ఈ తేదీల్లో రిజల్ట్స్ విడుదల?

Bandaru Satyaprasad HT Telugu
Apr 16, 2024 07:51 PM IST

TS Inter SSC Results 2024 : తెలంగాణ ఇంటర్ , పదో తరగతి ఫలితాల విడుదలపై ప్రాథమిక సమాచారం అందుతోంది. ఇప్పటికే స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ ముగియడంతో...ఫలితాల ప్రకటనపై అధికారులు దృష్టిపెట్టారు.

టీఎస్ ఇంటర్, టెన్త్ ఫలితాలు
టీఎస్ ఇంటర్, టెన్త్ ఫలితాలు (Pexels)

TS Inter SSC Results 2024 : తెలంగాణ ఇంటర్ ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. టీఎస్ ఇంటర్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్‌ 20 నుంచి 25 మధ్యలో విడుదల చేస్తామని సమాచారం అందుతోంది. ఏప్రిల్ 10వ తేదీకి స్పాట్ వాల్యూయేషన్ పూర్తి కావడంతో... ఒకేసారి ఇంటర్‌ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ ను మొత్తం 4 విడతల్లో చేపట్టారు. వాల్యూయేషన్ పూర్తి కాగా మార్కుల నమోదుతో పాటు ఎలాంటి ఇతర ఇబ్బందులు రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియ ఏప్రిల్‌ 21కి పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. వీటితో పాటు ఈసీ అనుమతి కూడా లభిస్తే... ఏప్రిల్ 22-25 మధ్య ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యే అవకాశం ఉంది.

ఏప్రిల్ 22-25 మధ్యలో ఇంటర్ ఫలితాలు?

ఈ ఏడాది 9 లక్షల మందిపైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలు(TS Inter Exams) రాశారు. వీరంతా ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు. గతంలో మాదిరిగా కాకుండా..ఈసారి తొందరగానే తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నారు. 2023లో మే 9వ తేదీన ఇంటర్ ఫలితాలను(TS Inter Results) ప్రకటించారు. అయితే ఈసారి మాత్రం ఏప్రిల్ 22 -25 మధ్య ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈసీ అనుమతి రాగానే ఫలితాల ప్రకటన తేదీపై విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇవ్వనున్నారు. దాదాపు ఏప్రిల్ 25 లోపు ఫలితాలు ప్రకటించి అవకాశం ఉంది.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2024 ఆన్‌లైన్‌లో ఎలా తనిఖీ చేయాలి?(TS Inter 2024 Results Download)

  1. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in/home.do లేదా ఇతర ఫలితాల పోర్టల్‌లను https://telugu.hindustantimes.com/telangana-board-result సందర్శించండి.
  2. ఇంటర్ ఫలితాల కోసం నిర్దేశించిన ట్యాబ్‌ పై క్లిక్ చేయాలి.
  3. మీ రోల్ నంబర్ లేదా హాల్ టికెట్ నంబర్, అవసరమైన సమాచారాన్ని నమోదు చేయండి.
  4. అన్ని వివరాలను చెక్ చేసుకుని, సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
  5. స్క్రీన్‌పై మీ ఫలితాలు కనిపిస్తాయి. అందులో మీ వివరాలు నిర్ధారించుకోండి.
  6. ఆ తర్వాత ఫలితాలను డౌన్ లోడ్ చేసుకుని తదుపరి అవసరాలకు ప్రింట్ తీసుకోండి.

తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే?(TS SSC 2024 Results Date and Time)

తెలంగాణలో పదో తరగతి పరీక్షల(TS 10th Results 2024) జవాబు పత్రాల మూల్యాంకనం దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఏప్రిల్ 3న ప్రారంభమైన స్పాట్ వాల్యూయేషన్ (Spot Valuation)ప్రక్రియ ఏప్రిల్ 13 వరకు కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 కేంద్రాలలో స్పాట్ వాల్యూయేషన్ చేశారు. మార్కులు కంప్యూటరీకరణ, పునఃపరిశీలన ప్రక్రియ పూర్తి కాగానే...ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటి వారంలో తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు. విద్యార్థులు ఫలితాల అప్ డేట్స్ కోసం అధికారిక వెబ్ సైట్ bse.telangana.gov.in చెక్ చేయవచ్చు. ఈ ఏడాది తెలంగాణ ఎస్ఎస్సీ పరీక్షలు(TS SSC Exams)మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించారు. పదో తరగతి ఫలితాల తేదీ, సమయంపై ఎస్ఎస్సీ బోర్డు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. టీఎస్ ఇంటర్ ఫలితాలు 2024 విడుదలైన వారం రోజుల తర్వాత పదో తరగతి ఫలితాల విడుదల చేస్తామని అధికారులు అంటున్నారు.

తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఇలా చెక్ చేసుకోవచ్చు

  1. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ను bse.telangana.gov.in లేదా https://telugu.hindustantimes.com/telangana-board-result పై క్లిక్ చేయండి
  2. హోమ్ పేజీలో TS SSC ఫలితాలు 2024 లింక్‌ పై క్లిక్ చేయండి.
  3. విద్యార్థి హాల్ టికెట్ సంఖ్యను నమోదు చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
  4. విద్యార్థి 10వ తరగతి ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
  5. విద్యార్థులు భవిష్యత్తు సూచన కోసం టెన్త్ ఫలితాల మార్క్ షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి.

IPL_Entry_Point