TS Inter Results 2024 Updates : ముగిసిన 'స్పాట్ వాల్యూయేషన్' - ఆలోపే తెలంగాణ ఇంటర్ ఫలితాల వెల్లడి !-telangana inter exams spot valuation 2024 is over check the latest result updates ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Inter Results 2024 Updates : ముగిసిన 'స్పాట్ వాల్యూయేషన్' - ఆలోపే తెలంగాణ ఇంటర్ ఫలితాల వెల్లడి !

TS Inter Results 2024 Updates : ముగిసిన 'స్పాట్ వాల్యూయేషన్' - ఆలోపే తెలంగాణ ఇంటర్ ఫలితాల వెల్లడి !

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 17, 2024 07:43 AM IST

Telangana Inter Results 2024 Updates : తెలంగాణ ఇంటర్ జవాబు పత్రాల వాల్యూయేషన్ పూర్తి అయింది. మొత్తం నాలుగు విడతల్లో ఈ ప్రక్రియను పూర్తి చేశారు అధికారులు. త్వరలోనే ఫలితాలను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు
తెలంగాణ ఇంటర్ ఫలితాలు

Telangana Inter Results 2024 Updates : ఏపీ ఇంటర్ ఫలితాలు(AP Inter Results) వచ్చేశాయ్..! 22 రోజుల్లోనే స్పాట్ తో సహా ఇతర ప్రక్రియలను పూర్తి చేసి… ఫలితాలను ప్రకటించింది అక్కడి విద్యాశాఖ. ఇక తెలంగాణలోని విద్యార్థులు కూడా ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సంవత్సరానికి సంబంధించి 9 లక్షల మందిపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరంతా కూడా ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు.

తెలంగాణతో పోల్చితే… ఏపీలో ఒక్కరోజు ఆలస్యంగా ఇంటర్ పరీక్షలు(Telangana Inter Exams 2024) ప్రారంభమయ్యాయి. ఏపీలో మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఎగ్జామ్స్ జరిగాయి. కానీ తెలంగాణలో ఈసారి ఫిబ్రవరి 28వ తేదీ నుంచే స్టార్ట్ అయ్యాయి. మార్చి 19వ తేదీతో ఎగ్జామ్స్ పూర్తి అయ్యాయి. అయితే ఏపీలో మాత్రం… రికార్డు స్థాయిలో కేవలం 22 రోజుల వ్యవధిలోనే ఫలితాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక తెలంగాణలో స్పాట్ ప్రక్రియ పూర్తి కావటంతో…. మిగతా ప్రక్రియలను కూడా పూర్తి చేస్తున్నట్లు తెలిసింది. సాధ్యమైనంత త్వరగా ఫలితాలను ప్రకటించేందుకు అధికారులు సమయాత్తం అవుతున్నారు.

ముగిసిన ఇంటర్ స్పాట్…

తెలంగాణలో ఇంటర్ స్పాట్(Telangana Inter Spot Valuation 2024) వాల్యూయేషన్ పూర్తి అయింది. ఈ ప్రక్రియను మార్చి 10వ తేదీన ప్రారంభించంగా…. మొత్తం 4 విడతల్లో కంప్లీట్ చేశారు. ఏప్రిల్ మొదటి వారంలోపు మూల్యాంకన ప్రక్రియ అంతా కూడా పూర్తి అయింది. అయితే మార్కుల ఎంట్రీతో పాటు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే… ఫలితాల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. కోడింగ్, డీకోడింగ్ ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే ఫలితాలను వెల్లడించనున్నారు. ఈసారి కూడా ఒకేసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి ప్రకటించే ఛాన్స్ ఉంది.

ఆ తేదీలోపే ఫలితాలు…

గతంలో మాదిరిగా కాకుండా..ఈసారి తొందరగానే తెలంగాణ ఇంటర్ ఫలితాలు రానున్నాయి. 2023 ఏడాదిలో మే 9వ తేదీన ఫలితాలను ప్రకటించారు. అయితే ఈసారి మాత్రం ఏప్రిల్ 21 -25వ తేదీలోపు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో… ఈసీ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆ దిశగా అధికారులు అడుగులు వేస్తుడంగా…ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే… ఫలితాల విడుదలకు ముహుర్తం ఖరారు కానుంది. దాదాపు ఏప్రిల్ చివరి వారంలోని ఏ తేదీలోనైనా వెల్లడించే ఛాన్స్ ఉంది. ఎంసెట్ తో పాటు మరిన్ని పరీక్షల దృష్ట్యా వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని విద్యాశాఖ భావిస్తోంది.

How To Check TS Inter Results : HT తెలుగులో తెలంగాణ ఇంటర్ ఫలితాలు

గతేడాది మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ ఇంటర్ పరీక్షల(TS Inter Exams 2024) ఫలితాలను హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సింపుల్ గా చెక్ చేసుకోవచ్చు.

TS Inter Results Link 2024: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఇంటర్ బోర్డు సైట్ https://tsbie.cgg.gov.in/home.do లోను చెక్ చేసుకోవచ్చు.

  • అభ్యర్థులు ముందుగా https://tsbie.cgg.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోంపేజీలో కనిపించే TS Inter Results 2024 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • మీ రూల్ నెంబర్ ను నమోదు చేసి క్లిక్ బటన్ పై నొక్కితే మీ రిజల్ట్ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

ఈసారి తెలంగాణ ఇంటర్ పరీక్షలకు మొత్తం 9,22,520 మంది విద్యార్థులు ఎగ్జామ్ ఫీజును చెల్లించారు. ఇందులో 4,78,527 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఉండగా... 4 లక్షలకుపైగా సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం