TS Model School : ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ఆన్‌లైన్ అప్లికేషన్ విడుదల
ఈ ఏడాది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కోర్సుల (ఇంగ్లీష్ మీడియం) ప్రవేశాల కోసం తెలంగాణ మోడల్ స్కూల్ దరఖాస్తులను కోరుతుంది.
తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్స్ (TSMS) ప్రస్తుత సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కోర్సులలో (ఇంగ్లీష్ మీడియం) ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను విడుదల చేసింది. MPC, BIPC, MEC, CEC కోర్సులలో ప్రవేశానికి SSC ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఒక ప్రకటన తెలిపింది. దరఖాస్తులను జూలై 10 వరకు సమర్పించవచ్చు. పూర్తి సమాచారం కోసం విద్యార్థులు www.tsmodelschools.com వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
TS మోడల్ స్కూల్ ఇంటర్ మెుదటి సంవత్సరంలో చేరేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మే నెలలో అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేశారు. ఈ మోడల్ స్కూల్స్‌లో చేరాలనుకునే విద్యార్థులు వివరాలను తనిఖీ చేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్స్‌లో ఇంటర్మీడియట్ 1వ సంవత్సరంలో అడ్మిషన్ కోసం TS మోడల్ స్కూల్ అడ్మిషన్ వెబ్ పోర్టల్‌లో ఆన్‌లైన్ అప్లికేషన్ విడుదల చేశారు.
TS మోడల్ స్కూల్స్ వివిధ ఇంటర్మీడియట్ కోర్సులలో ప్రవేశాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రతి స్ట్రీమ్‌లో 40 సీట్లు ఉన్నాయి. విద్యార్థులు మీ సేవా కేంద్రాలను సందర్శించి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ 10-07-2022గా ఉంది.
షెడ్యూల్ ప్రకారం ఎంపిక జరుగుతుంది. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుంది. అదే రోజు అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తారు. TS మోడల్ స్కూల్స్ జూనియర్ ఇంటర్ అడ్మిషన్లు, ఎంపిక జాబితా, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలు చెబుతుతారు. సంబంధిత పాఠశాలల్లో TS మోడల్ స్కూల్స్ వారీగా మెరిట్ జాబితా(జిల్లా స్థాయిలో) TSMS స్కూల్ లేదా DEO కార్యాలయంలో నోటీసు బోర్డులో పెడతారు.
టాపిక్