TS SSC Results 2024 Updates : పూర్తి కావొచ్చిన స్పాట్ వాల్యూయేషన్..! ఆలోపే తెలంగాణ పదో తరగతి ఫలితాల వెల్లడి..!
Telangana 10th Results 2024 Updates : తెలంగాణ టెన్త్ పరీక్షల(TS SSC Exams ) స్పాట్ వాల్యూయేషన్ దాదాపు పూర్తి అయింది. ఫలితాలను ప్రకటించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం… కసరత్తు చేస్తోంది. ఈసారి ఫలితాలు ముందుగానే రానున్నాయి.
TS SSC Results 2024 Updates : తెలంగాణలో పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం(TS SSC Spot Valuation 2024) దాదాపు పూర్తి కావొచ్చింది. ఏప్రిల్ 3వ తేదీ నుంచే స్పాట్ ప్రక్రియ పూర్తి కాగా…. ఏప్రిల్ 11వ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికారులు భావించారు. మధ్యలో ఉగాది, రంజాన్ సెలవు దినాలు వచ్చాయి. దీంతో కొంచెం ఆలస్యమైంది. అయితే ఇవాళ్టి(ఏప్రిల్ 13)తో దాదాపు టెన్త్ స్పాట్ ప్రక్రియ పూర్తి కానుంది. స్పాట్ వాల్యూయేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 కేంద్రాలను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
టెన్త్ స్పాట్(SSC Spot Valuation 2024) ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు చేపట్టారు అధికారు. సిబ్బంది కొరత రాకుండా చర్యలు తీసుకున్నారు. స్పాట్ ప్రక్రియ పూర్తి కావటంతో… మార్కుల ఎంట్రీతో పాటు సాంకేతికపరమైన అంశాలను పరిశీలించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకటికి రెండు సార్లు అన్నింటిని చెక్ చేసుకున్న తర్వాతే…. ఫలితాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఫలితాలు ఎప్పుడు రావొచ్చంటే..?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు లేనప్పటికీ…పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది. ప్రభుత్వ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. దీంతో సాధ్యమైనంత త్వరగా… ఫలితాలను ప్రకటించాలని తెలంగాణ ఎస్ఎస్సీ బోర్డు(TS SSC Board ) భావిస్తోంది. కీలకమైన స్పాట్ పూర్తి కావటంతో… సాంకేతికపరమైన అంశాలపై దృషిపెట్టి… తేదీని ప్రకటించాలని యోచిస్తోంది.
2023లో చూస్తే తెలంగాణ పదో తరగతి ఫలితాలు…. మే 10వ తేదీన వెల్లడించారు. అప్పుడు ఏప్రిల్ 13వ తేదీతో ఎగ్జామ్స్ ముగిశాయి. కానీ ఈ విద్యాసంవత్సరం పరీక్షలు ముందుగా ప్రారంభమయ్యాయి. మార్చి 18వ తేదీతో స్టార్ట్ అయి…. ఏప్రిల్ 2వ తేదీ నాటికి అన్ని పూర్తి అయ్యాయి. ఆ వెంటనే స్పాట్ షురూ అయింది. గతంలో మాదిరిగా మే రెండో వారం కాకుండా…ఈసారి ఏప్రిల్ చివరి వారంలోనే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఇది వీలు కాకపోతే… మే ఫస్ట్ వీక్ లోని ఏదైనా తేదీని ఖరారు చేసే ఛాన్స్ ఉంది. ఇక ఫలితాల విడుదలకు సంబంధించి ఎన్నికల సంఘానికి కూడా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈసీ అనుమతితోనే ఫలితాలను ప్రకటించనున్నారు.
How to Check TS SSC Results 2024 : HT తెలుగులో పదో తరగతి ఫలితాలు
గతేడాది మాదిరిగానే ఈసారి కూడా హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో తెలంగాణ పదో తరగతి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. కేవలం ఒకే ఒక్క క్లిక్ తో మీ మార్కుల జాబితా డిస్ ప్లే అవుతుంది. ఆ ప్రాసెస్ ఇక్కడ చూడండి..
- తెలంగాణ పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు https://telugu.hindustantimes.com/telangana-board-result లింక్ పై క్లిక్ చేయాలి.
- హోంపేజీలో కనిపించే https://telugu.hindustantimes.com/telangana-board-10th-result-2024 లింక్ పై క్లిక్ చేయాలి.
- మీ రూల్ నెంబర్ ను ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తే మీ మార్కుల మెమో డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ ఆప్షన్ పై నొక్కి మీ మార్కుల వివరాల కాపీని పొందవచ్చు.
మరోవైపు తెలంగాణ పదో తరగతి పరీక్షల బోర్డు అధికారిక వెబ్ సైట్ https://results.bsetelangana.org/ లోకి వెళ్లి కూడా ఫలితాలను చూసుకోవచ్చు. హోం పేజీలో కనిపించే TS SSC Results 2024 లింక్ పై క్లిక్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. మీ పరీక్షా ఫలితాలు డిస్ ప్లే అవుతాయి. ప్రింట్ ఆప్షన్ పై నొక్కి మార్కుల మెమోను పొందవచ్చు.
ఈ ఏడాది జరిగిన తెలంగాణ పదో తరగతి పరీక్ష(TS SSC Exams) కోసం 5.08 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ ఫీజులను చెల్లించారు. ఇందులో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. ఈ ఎగ్జామ్స్ కోసం మొత్తం 2,676 కేంద్రాలను ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే.