KVP Comments : నితీశ్ ను మించిపోయారు.. అమిత్ షా, రాహుల్ పై రాళ్లు వేయించిన ఘనత చంద్రబాబుదే-political news kvp ramachandra rao slams cm jagan and chandrababu naidu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kvp Comments : నితీశ్ ను మించిపోయారు.. అమిత్ షా, రాహుల్ పై రాళ్లు వేయించిన ఘనత చంద్రబాబుదే

KVP Comments : నితీశ్ ను మించిపోయారు.. అమిత్ షా, రాహుల్ పై రాళ్లు వేయించిన ఘనత చంద్రబాబుదే

Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 09, 2024 08:06 PM IST

KVP Ramachandra Rao Comments: సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత కేవీపీ. ఏపీలో అసమర్థ ప్రభుత్వం ఉందన్న ఆయన.. అమిత్ షా, రాహుల్ గాంధీపై రాళ్లదాడి చేయించిన ఘనత చంద్రబాబుకే దక్కిందంటూ కామెంట్స్ చేశారు.

కేవీపీ
కేవీపీ

KVP Ramachandrao On YCP, TDP : వైసీపీ, తెలుగుదేశం పార్టీల తీరుపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు. ప్రధాని మోదీ దర్శనం దొరికినందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు అభినందనలు తెలపాలంటూ సైటెర్లు విసిరారు. ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ సార్లు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగనే అన్న ఆయన… ఇసుక, మద్యం కుంభకోణం లో దేశంలో చాలా మంది నేతలు అరెస్టు అయ్యారు కానీ ఏపీలోని నేతలకు మాత్రం మినహాయింపు కలిగించారంటూ విమర్శనాస్త్రాలను సంధించారు. బిజెపి దృష్టిలో దేశంలో ఎలాంటి మరక లేని ప్రభుత్వం ఏపీ ఒక్కటే అనుకుంటా అంటూ తనదైన శైలిలో చురకలు అంటించారు.

ఇక్కడి నేతలపై కేసులు ఎందుకు లేవు…?

KVP On BJP : “ఏపీలోని ఏ మంత్రి పైనా ఎంపీలపైనా కేసులు, అరెస్టులు ఎందుకు లేవో బిజెపి చెప్పాలి. దేశం అంతా నగదు రహిత లావాదేవీలు ఉన్నా ఏపీ లో మాత్రం అంతా నగదు తోనే విక్రయాలు జరిగినా కేంద్రం పట్టించుకోదు. వైఎస్ బొమ్మ పెట్టుకుని ఓట్లు అడగడానికి వెళ్తున్న వైసిపి నేతలకు సిగ్గు లేదు. పోలవరం పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలియటం లేదు. పోలవరం విషయంలో ఏపీ భావితరాలు జగన్ ప్రభుత్వాన్ని, గత టిడిపి ప్రభుత్వాన్ని క్షమించవు. పోలవరం పూర్తి అయితే చాలా ఎత్తిపోతల పథకాలు నిర్మించుకునే వీలుంది. 2 వేల టిఎంసి ల నీరు వినియోగించుకోవచ్చ. వైసిపి ప్రభుత్వం పోలవరాన్ని ఏటీఎమ్ లా వాడుకుంటోదని కేంద్రంలో ఉన్నత స్థాయిలోని వ్యక్తి నాతో అన్నారు. అది బ్యారేజీలా మిగిలి పోకూడదు. ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ కేంద్రం నుంచి ఏం సాధించుకునీ వచ్చారో తెలియదు. పాత అంశాలనే చెప్పి మళ్ళీ ఏపీ ప్రజలను మభ్య పెడతారు. సొంత చెల్లెలు , తల్లి పై అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకొని అసమర్థ ప్రభుత్వం ఏపిలో ఉంది. ప్రభుత్వాధినేతగా ఏపీలో కేసులు పెడితే తీసుకోరు పొరుగు రాష్ట్రంలో కేసులు పెడితే సహకరించరు. ప్రధాని మోదీ, బిజెపి పార్టీలు ఏపీ ప్రజలను నిట్టనిలువునా మోసం చేశారు” అని మండిపడ్డారు కేవీపీ.

ఆ ఘనత చంద్రబాబుదే…

“రాజధాని అమరావతి నిర్మాణ సమయంలో మోదీ కలుషిత మట్టి, కలుషిత జలాలు తెచ్చి ఏపీ నోట్లో మట్టి కొట్టారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు పార్టీల పొత్తులు మార్చడంలో నితీష్ కుమార్ ను మించిపోయారు. అమిత్ షా పైనా, రాహుల్ గాంధీ పైనా రాళ్ళు వేయించిన ఘనత ఆయనదే. నిన్న అమిత్ షా, జెపి నద్దాను కలిసి ఏం అంశాలు చర్చించారు. ప్రత్యేక హోదా, పోలవరం, అమరావతి గురించి హామీలు ఏమైనా ఇచ్చారా..? చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి. 2019 నుంచి 2024 వరకూ బిజెపి ఏపీ కి ఏం మేలు చేసింది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే” అని కేవీపీ స్పష్టం చేశారు.

Whats_app_banner