Sajjala on Chandrababu | అందుకే ఢిల్లీకి చంద్రబాబు.. సర్వేలు అన్నీ మాకే అనుకూలం
- రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించేందుకే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన సజ్జల..చంద్రబాబులో స్పష్టంగా బలహీనత కనబడుతోందని చెప్పారు. అందుకే ఢిల్లీకి వెళ్లి బీజేపీతో పొత్తుల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు స్క్రిప్ట్‌ను వైఎస్ షర్మిల చదువుతోందని మండిపడ్డారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేదని, అద్దె మైకులా షర్మిల ఇక్కడ విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని, మరోసారి వైసీపీ అధినేత జగన్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు సజ్జల.