Pawan Kalyan : వాలంటీర్లే వైసీపీకి ప్రైవేట్ సైన్యం - జగ్గుభాయ్ గ్యాంగ్ భ్రమలు తొలగిస్తామన్న పవన్-pawana kalyan fires on ycp govt at tadepalligudem ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawan Kalyan : వాలంటీర్లే వైసీపీకి ప్రైవేట్ సైన్యం - జగ్గుభాయ్ గ్యాంగ్ భ్రమలు తొలగిస్తామన్న పవన్

Pawan Kalyan : వాలంటీర్లే వైసీపీకి ప్రైవేట్ సైన్యం - జగ్గుభాయ్ గ్యాంగ్ భ్రమలు తొలగిస్తామన్న పవన్

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 13, 2023 09:58 PM IST

Janasena Party Latest News: వైసీపీ సర్కార్ పై మరోసారి విమర్శనాస్త్రాలు గుప్పించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రాష్ట్రం తమదే అనే భ్రమలో జగ్గుభాయ్ గ్యాంగ్ ఉందని… త్వరలోనే వారి భ్రమలను తొలగిస్తామని వ్యాఖ్యానించారు.

పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్

Pawana Kalyan : వైసీపీ సర్కార్ పై మరోసారి విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అసలు పంచాయతీరాజ్ వ్యవస్థ ఉన్న తర్వాత... వాలంటీర్ల అవసరమేంటని ప్రశ్నించారు. వాలంటీర్లే వైసీపీకి ప్రైవేటు సైన్యమే అన్న పవన్.... రాష్ట్రంలో తమదే అనే భ్రమలో జగ్గుభాయ్ గ్యాంగ్ ఉందన్నారు. త్వరలోనే ఆ భ్రమలు తొలగిస్తామని స్పష్టం చేశారు. గురువారం తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ శ్రేణుల సమావేశంలో మాట్లాడిన ఆయన... అర్హతలేని వాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలుతున్నాడని... అలాంటి వారితోనే మనం యుద్ధం చేయబోతున్నామని చెప్పారు.

"వాలంటీర్లు చాలా సూక్ష్మమైన వివరాలను సేకరిస్తున్నారు. 5వేల కోసం వారు చెబుతున్నారని ఇలాంటి పనులు చేయటం సరికాదు. ప్రభుత్వాలు మారితే డేటా సేకరణ విషయంలో వాలంటీర్లు బలవుతారు. వాలంటీర్ల తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి.వాలంటీర్ల రూపంలో ప్రతి ఇంటికి ఒక జగన్ ను పెట్టేశారు. వేలిముద్రలతో సహా ఇంట్లోని కుటుంబ సభ్యుల వివరాలను పూర్తిగా తీసుకుంటున్నారు. వ్యక్తిగత డేటా విషయంలో 2019లో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కానీ ఇలాంటి కీలక వివరాలన్నీ హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలోని ఓ సంస్థకు ఇస్తున్నారు, జగ్గుభాయ్ కేవలం రాజకీయ నాయకులనే చూశాడు. నాలాంటి విప్లవకారుడిని చూడలేదు" అంటూ పవన్ వార్నింగ్ ఇచ్చారు.

రాజకీయాల్లో అనేక ప్రలోభాలను దాటుకొని ముందుకు వెళ్తున్నామని చెప్పారు పవన్ కల్యాణ్. అద్భుతాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదని…. పేదల బతుకులు మార్చాలని వచ్చానని కామెంట్స్ చేశారు. అడ్డగోలుగా దోచేస్తున్న వారిపై జనసేన పోరాడుతుందని స్పష్టం చేశారు. జగన్​ఓ రౌడీ పిల్లవాడని.. ఆయన్ని ఎలా హ్యాండిల్​ చేయాలో తెలుసన్నారు. జగన్​ గిల్లాడని వెళ్లి తాము ప్రధాని మోదీ కి కంప్లెంట్​ చేయబోమని.. ఇక్కడే తాడోపేడో తేల్చుకుంటామన్నారు.

శ్రీకాళహస్తిలో జనసేన నేతను సీఐ కొట్టడంపై పవన్ కల్యాణ్ స్పందించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నాయకుణ్ని చెంపదెబ్బ కొట్టడమేంటని ప్రశ్నించారు.శుక్రవారం శ్రీకాళహస్తి వెళ్లనని… అక్కడి నేతలకు అండగా ఉంటానన్నారు.

Whats_app_banner