Police Case On Pawan: పవన్ కళ్యాణ్‌పై పోలీస్ కేసు నమోదు..
Police Case On Pawan: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై పోలీస్ కేసు నమోదైంది. వాలంటీర్ల ఫిర్యాదుతో విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
Police Case On Pawan: వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్‌పై విజయవాడలో పోలీస్ కేసు నమోదైంది. వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులకు సమాచారం ఇస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపాయి. మహిళలకు పెద్ద సంఖ్యలో గల్లంతవుతున్నా వారి అచూకీ కనిపెట్టడంలో పోలీసులు విఫలమయ్యారని ఇటీవల పవన్ ఆరోపించారు.
దేశంలో మహిళల అక్రమ రవాణా ఏపీలోనే ఎక్కువ జరుగుతోందని, వాలంటీర్లు మహిళల సమాచారాన్ని అసాంఘిక శక్తులకు చేరవేస్తున్నారని ఆరోపించారు. ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ఉండే మహిళల సమాచారాన్ని పక్కదారి పట్టిస్తున్నారని పవన్ ఆరోపించడంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు.
తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ వాలంటీర్లు ఫిర్యాదు చేయడంతో విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పవన్ కళ్యాణ్‌పై ఐపీసీ సెక్షన్లు 153, 153ఏ, 502(2)సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు.
సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రజల మధ్య చిచ్చు రాజేసేందుకు ప్రయత్నించినందుకు ఐపీసీ 153 ప్రకారం కేసు నమోదు చేశారు. బహిరంగ వేదికపై ఈ వ్యాఖ్యలు చేసినందుకు 153ఏ సెక్షన్ కూడా చేర్చారు. వాలంటీర్లను అవమానించేలా, నిందపూర్వక వ్యాఖ్యలు చేసినందుకు ఐపీసీ 502(2) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.