
కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ‘పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ’ నెల రోజుల పాటు క్షేత్రస్థాయిలో చేసిన సర్వేలో రైతుల ఆవేదన, ఆగ్రహం స్పష్టంగా వెల్లడైంది. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకూ ‘‘మా గోడు ఎవరూ పట్టించుకోవడం లేదు!’’ అని రైతులు ఒకే స్వరంతో వినిపిస్తున్నారు.



