CM Jagan: వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, ప్రభుత్వ సంక్షేమ సారథులన్న సిఎం జగన్-chief minister jaganmohan reddy praised the services of the volunteers ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Chief Minister Jaganmohan Reddy Praised The Services Of The Volunteers

CM Jagan: వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, ప్రభుత్వ సంక్షేమ సారథులన్న సిఎం జగన్

HT Telugu Desk HT Telugu
May 19, 2023 11:58 AM IST

CM Jagan: ఏపీలో ప్రజలకు ప్రజా ప్రభుత్వానికి మధ్య వారధులు, సంక్షేమ సారథులుగా వాలంటీర్లను చెప్పడానికి గర్వపడుతున్నట్లు జగన్ తెలిపారు. విజయవాడలో వాలంటీర్లకు వందనం పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో సిఎం పాల్గొన్నారు.

వాలంటీర్లకు పురస్కారాలను విడుదల చేసిన సిఎం జగన్
వాలంటీర్లకు పురస్కారాలను విడుదల చేసిన సిఎం జగన్

CM Jagan: ఏపీలో ప్రజలకు ప్రజా ప్రభుత్వానికి మధ్య వారధులు, సంక్షేమ సారథులుగా వాలంటీర్లను చెప్పడానికి గర్వపడుతున్నట్లు జగన్ తెలిపారు. విజయవాడలో వాలంటీర్లకు వందనం పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో సిఎం పాల్గొన్నారు. ప్రతి అవ్వాతాతలకు మంచి మనుమరాలు, మనుమడిగా సేవలు అందిస్తున్నారని కొనియాడారు.

64లక్షల మంది లబ్దిదారులకు ప్రభుత్వ పెన్షన్లను అందిస్తున్న గొప్ప సేవకులు, సైనికులని వాలంటీర్లను కొనియాడారు. 2019నుంచి 2.66లక్షల మంది మహా సైన్యం వ్యవస్థ ప్రజలకు సేవలు అందిస్తోందని చెప్పారు.

దేశంలో ఎక్కడ లేని విధంగా వాలంటీర్ల ద్వారా ప్రజలకు మంచిని అందించే కార్యక్రమం వాలంటీర్ల నిర్వహిస్తున్నారని చెప్పారు.

రాష్ట్రంలో వాలంటీర్ల ద్వారా డిబిటి నాన్‌ డిబిటి పథకాల ద్వారా ఇప్పటి వరకు రూ.3లక్షల కోట్ల రుపాయల విలువైన మంచిని నాలుగేళ్లలో ప్రజలకు అందించినట్లు సిఎం జగన్ చెప్పారు.

ప్రభుత్వంపై పనిగట్టుకుని సోషల్ మీడియాలో ఎలా దుష్ప్రచారం చేస్తున్నారో అంతా చూస్తున్నారని, మంచి చేస్తున్న పేదల ప్రభుత్వం మీద గిట్టని వారి తప్పుడు ప్రచారం చేస్తూ నిందలు వేస్తున్నారని, నిజాలను ప్రజలకు వివరించే సత్య సారథులు, సత్య సాయుథులు వాలంటీర్లు మాత్రమేనన్నారు.

తనకు పత్రికలు, టీవీలు అండగా లేకపోయినా, ప్రతి ఇంటికి నేరుగా వెళ్లగలిగే వాలంటీర్ల వ్యవస్థ ప్రభుత్వానికి అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వాన్ని ప్రతి గడప వద్దకు తీసుకెళ్లగలిగినందున, ప్రతి ఇంట్లో మంచి జరిగిందో లేదో ధైర్యంగా అడిగే హక్కు వాలంటీర్లతోనే సాధ్యమైందన్నారు. వాలంటీర్ వ్యవస్థ ప్రతి గడపలో మంచి తప్ప చెడు ఎక్కడా చేయలేదన్నారు.

వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వ పరిధిలోకి వచ్చే సేవ కాదని, ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా స్వచ్ఛంధంగా మంచి చేయాలనే తపన తాపత్రయంతో ఉన్న మంచి మనుషులని కొనియాడారు. ప్రభుత్వ సేవకు దన్నుగా అండగా నిలుస్తున్న వారిని అంతా అభినందించాలన్నారు.

లంచం తీసుకోవాలనే ఆలోచన రాకూడదనే….

లంచం తీసుకోవాలనే ఆలోచన రాకుండా గుర్తింపునివ్వడానికి ప్రతి ఏటా అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ మీద డజను జెలుసిల్ మాత్రలు వేసినా తగ్గనంత కడుపు మంట ప్రత్యర్థులకు ఉందని సిఎం జగన్ ఎద్దేవా చేశారు. వాలంటీర్ వ్యవస్థ మీద విపరీతమైన దుష్ప్రచారం చేశారని, వాలంటీర్లు అల్లరి మూకలని, అది మూటలు మూసే ఉద్యోగమని, అధికారం వస్తే వాలంటీర్లను రద్దు చేసి జన్మభూమి కమిటీలు పెడతామన్నారని గుర్తు చేశారు.

వాలంటీర్ల ఏర్పాటుపై కోర్టుకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నాలు కూడా జరిగాయని వివరించారు. వాలంటీర్ల సేవాభావానికి ప్రజలు మెచ్చుకోవడం మొదలవడంతో చంద్రబాబు మాట మార్చిఅధికారంలోకి వస్తే కొత్త జన్మభూమి కమిటీలతో వాలంటీర్ సైన్యాన్ని తీసుకోస్తామన్నాడని గుర్తు చేశారు. చంద్రబాబు, అతని అనుకూల మీడియా రాజకీయాలు జరుగుతున్నా ,వాలంటీర్లు మంచి చేసే తన ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారని చెప్పారు.

రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఇంకా ఎక్కువగా వెళ్లే పరిస్థితి రావాలని, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా చూపించాలని, ఇంతకు ముందు ఈ మంచి జరిగిందో లేదో అడగాలని వాలంటీర్లను సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మంచి చేసే అవకాశం రావాలని అకాంక్ష వ్యక్తం చేశారు.

అమ్మ ఒడి, ఆసరా, చేయూత, ఇళ్లపట్టాలు, రైతు భరోసా అన్ని పథకాల అమలు వాలంటీర్ల భాగస్వామ్యంతోనే సాధ్యమైందన్నారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల అరాచకాలు చూశారని, వివక్ష, లంచాలు చూశామని వైసీపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన తులసిమొక్కల్లాంటి వ్యవస్థే వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటైందన్నారు. 25 పథకాలకు సంబంధిచిన బ్రాండ్‌ అంబాసిడర్లుగా వాలంటీర్లు నిలిచారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా సేవా భావంతో ప్రజలకు మంచి చేయాలనే తపన, తాపత్రయంతో ప్రజలకు సేవ చేస్తున్నారన్నారు.

IPL_Entry_Point