Chandrababu Offer To Volunteers : జగనన్న సైన్యానికి చంద్రబాబు బంపర్ ఆఫర్- రూ.50 వేల సంపాదన!-kuppam news in telugu tdp chief chandrababu offer volunteers skill development for better life ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Kuppam News In Telugu Tdp Chief Chandrababu Offer Volunteers Skill Development For Better Life

Chandrababu Offer To Volunteers : జగనన్న సైన్యానికి చంద్రబాబు బంపర్ ఆఫర్- రూ.50 వేల సంపాదన!

Bandaru Satyaprasad HT Telugu
Mar 26, 2024 06:26 PM IST

Chandrababu Offer To Volunteers : వాలంటీర్లకు టీడీపీ అధినేత చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు. వాలంటీర్లు రూ.30 వేలు నుంచి రూ.50 వేలు సంపాదించుకునేలా అవకాశం కల్పిస్తామన్నారు.

 జగనన్న సైన్యానికి చంద్రబాబు బంపర్ ఆఫర్
జగనన్న సైన్యానికి చంద్రబాబు బంపర్ ఆఫర్

Chandrababu Offer To Volunteers : 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ...అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థను(Volunteer System) తీసుకొచ్చింది. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ను నియమించింది. వైసీపీ మద్దతుదారులనే వాలంటీర్లగా నియమించారనే విమర్శలు లేకపోలేదు. ప్రభుత్వ పథకాలను నేరుగా ఇంటికే తీసుకెళ్లేందుకు వాలంటీర్లను నియమించినట్లు వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. వాలంటీర్లను సీఎం జగన్(CM Jagan) తన సైన్యంగా చెబుతుంటారు. అయితే ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు(Volunteers Salaries) ఇస్తూ వాలంటీర్లను వైసీపీ(Ysrcp) తనకు అనుకూలంగా పనిచేయించుకుంటుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏపీ ఎన్నికల్లో వాలంటీర్లు కీలకంగా మారాయి. ప్రభుత్వ పథకాలను ఇన్నాళ్లు అందించిన వాలంటీర్లు చాలా చోట్ల వైసీపీకి ప్రచారం చేస్తున్నారు. ఈసీ దీనిని సీరియస్ తీసుకుని అలాంటి వారిని సస్పెండ్ చేస్తుంది. వాలంటీర్లను ఎన్నికల విధుల్లో, ప్రచారాల్లో ఉపయోగించవద్దని ఈసీ(EC) స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయితే వాలంటీర్ల వ్యవస్థపై ప్రతిపక్షాలు గుర్రుగా ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేయకతప్పడంలేదు.

ట్రెండింగ్ వార్తలు

వాలంటీర్లు నెలకు రూ.30 వేలు సంపాదించాలే చేస్తా

టీడీపీ అధినేత చంద్రబాబు మంగళవారం కుప్పం నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారం సందర్భంగా నిర్వహించిన యువతో సమావేశమయ్యారు. ఈ సభలో చంద్రబాబు(Chandrababu) మాట్లాడుతూ వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు(Volunteers) నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు సంపాదించుకునేందుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌(Skill Development) ద్వారా నైపుణ్య శిక్షణ ఇస్తామని ప్రకటించారు. టీడీపీ ప్రభుత్వంలో వాలంటీర్ల జీవితాలు మారుస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా అల్లాడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రతీ ఏడాది జాబ్‌ క్యాలెండర్(Job Calendar) విడుదల చేస్తామని మాయమాటలు చెప్పి యువతను నిలువునా ముంచారని విమర్శించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్(DSC Notification) కూడా లేదన్నారు. ఎన్నికల ముందు నిరుద్యోగుల మోసం చేసేందుకు డీఎస్సీ అంటూ హడావుడి చేస్తున్నారన్నారు. గ్రూప్‌-1 పోస్టులను తమకు నచ్చిన వాళ్లకు ఇచ్చుకున్నారని చంద్రబాబు ఆరోపించారు.

మండల కేంద్రాల్లో వర్క్ స్టేషన్లు

రాష్ట్రంలో ఐటీని ప్రోత్సహించి యువతకు కొత్త దారి చూపిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. భవిష్యత్తులో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌(Work From Home) కాస్సెప్ట్ అమలుచేస్తామన్నారు. అన్ని మండల కేంద్రాల్లో వర్క్‌ స్టేషన్లు నిర్మించి, ప్రతీ నియోజకవర్గం అభివృద్ధికి ఒక విజన్‌ తయారుచేస్తామన్నారు. వైసీపీ నాయకుల దోపిడీ నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు మూడు పార్టీలు ఏకమయ్యాయని చంద్రబాబు అన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో జే బ్రాండ్ మద్యాన్ని అరికడతామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు యువత సాయం కావాలన్నారు.

వాలంటీర్లపై బొజ్జల వివాదాస్పద వ్యాఖ్యలు-షాకిచ్చిన టీడీపీ

వాలంటీర్లపై శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి(Bojjala Sudheer Reddy On Volunteers) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారిని టెర్రరిస్టులతో పోలుస్తూ విమర్శించారు. బొజ్జల వ్యాఖ్యలపై టీడీపీ(TDP) స్పందించింది. బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన కామెంట్స్ ఆయన వ్యక్తిగతమని, పార్టీకి సంబంధంలేదని ప్రకటించింది. టీడీపీ అధికారంలోకి రాగానే వాలంటీర్లకు జీతాలు పెంచుతామని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకునేందుకు అవకాశాలు కల్పిస్తామని తెలిపింది. అయితే కొంతమంది వాలంటీర్లు వైసీపీకి అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించింది. ఇప్పటికే ఎన్నికల కోడ్(Election Code) ఉల్లంఘించిన 200 మందికి పైగా వాలంటీర్లను ఈసీ సస్పెండ్ చేసిందని గుర్తుచేసింది. వాలంటీర్లు చట్టవ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని టీడీపీ సూచించింది.

WhatsApp channel

సంబంధిత కథనం