Raghurama With Jagan: అసెంబ్లీలో రఘురామతో చేతులు కలిపిన జగన్, రోజూ అసెంబ్లీకి రావాలన్న RRR, చూస్తారుగా అంటూ జగన్ రిప్లై-jagan who joined hands with raghurama in the assembly replied that rrr should come to the assembly every day he will ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Raghurama With Jagan: అసెంబ్లీలో రఘురామతో చేతులు కలిపిన జగన్, రోజూ అసెంబ్లీకి రావాలన్న Rrr, చూస్తారుగా అంటూ జగన్ రిప్లై

Raghurama With Jagan: అసెంబ్లీలో రఘురామతో చేతులు కలిపిన జగన్, రోజూ అసెంబ్లీకి రావాలన్న RRR, చూస్తారుగా అంటూ జగన్ రిప్లై

Sarath chandra.B HT Telugu
Jul 22, 2024 12:27 PM IST

Raghurama With Jagan: ఏపీ అసెంబ్లీలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీ మాజీ ఎంపీ, ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజుతో వైసీపీ అధ్యక్షుడు జగన్ చేతులు కలిపారు.

టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామతో మాజీ సిఎం జగన్ (ఫైల్‌ ఫోటో)
టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామతో మాజీ సిఎం జగన్ (ఫైల్‌ ఫోటో)

Raghurama With Jagan: ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మాజీ సీఎం జగన్‍తో, వైసీపీ మాజీ ఎంపీ, ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు మాటలు కలిపారు. జగన్ భుజంపై చేయి వేసి రఘురామ ముచ్చటించినట్టు ఆయనే తర్వాత మీడియాకు చిట్‌చాట్‌లో చెప్పారు.

జగన్ ప్రతి రోజు అసెంబ్లీకి రావాలని తాను కోరినట్టు రఘురామ చెప్పారు. రఘురామ ప్రశ్నకు రెగ్యులర్‍ గా సభకు వస్తాననిజగన్ సమాధానం ఇచ్చారు. సభలో ప్రతిపక్షం లేకపోతే ఎలా అంటూ రఘురామ మీడియాతో చమత్కారించారు.

తనకు జగన్ పక్కనే సీటు కేటాయించాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావులను రఘురామకృష్ణంరాజు కోరడంతో ఆయన సరేనంటూ వెళ్లిపోయారు. అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రఘురామకృష్ణంరాజు అభినందనలు తెలిపారు.

సోమవారం ఉదయం అసెంబ్లీలో కనిపించిన వెంటనే వైఎస్ జగన్‌ని రఘురామ పలకరించారు. ప్రతిరోజు అసెంబ్లీకి రావాలని, ప్రతిపక్షం లేకపోతే ఎలా? అంటూ జగన్ చేతిలో చేయి వేసి మాట్లాడినట్టు రఘురామ చెప్పారు. అసెంబ్లీకి రెగ్యులర్ వస్తానని అది మీరే చూస్తారుగా జగన్ బదులిచ్చినట్టు తెలిపారు. జగన్‌తో రఘురామ మాట్లాడినట్టు ఉన్న ఫోటో క్షణాల్లో వైరల్‌గా మారింది. అయితే ఆ ఫోటో గతంలో రఘురామ వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలో తీసిందిగా తర్వాత గుర్తించారు.

Whats_app_banner