AP Law University: కర్నూలులో “లా యూనివర్శిటీ” శంకుస్థాపన చేసిన జగన్.. అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యమన్న సిఎం-jagan laid the foundation stone of law university in kurnool ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Law University: కర్నూలులో “లా యూనివర్శిటీ” శంకుస్థాపన చేసిన జగన్.. అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యమన్న సిఎం

AP Law University: కర్నూలులో “లా యూనివర్శిటీ” శంకుస్థాపన చేసిన జగన్.. అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యమన్న సిఎం

Sarath chandra.B HT Telugu
Mar 14, 2024 12:37 PM IST

AP Law University: ఏపీలో అభివృద్ధి వీకేంద్రీకరణే వైసీపీ ప్రభుత్వ ఉద్దేశమని సిఎం జగన్ ప్రకటించారు. కర్నూలులో న్యాయ విశ్వవిద్యాలయానికి సిఎం జగన్ శంకుస్థాపన చేశారు.

కర్నూలులో లా యూనివర్శిటీకి శంకుస్థాపన చేసిన సిఎం జగన్
కర్నూలులో లా యూనివర్శిటీకి శంకుస్థాపన చేసిన సిఎం జగన్

AP Law University: ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వికేంద్రీకరణకు తాము కట్టుబడి ఉన్నామని సిఎం జగన్మోహన్ రెడ్డి YS Jaganస్పష్టం చేశారు. కర్నూల్లో Kurnool లా యూనివర్సిటీ పనులకు సిఎం జగన్ శ్రీకారం చుట్టారు.

జగన్నాథ గట్టులో లా యూనివర్సిటీ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. భూమి పూజతో భవన నిర్మాణ పనులను సీఎం జగన్ ప్రారంభించారు. లా వర్సిటీ పైలాన్ ఆవిష్కరించారు.

కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురం Lakshmipuram జగన్నాథగట్టుపై 150 ఎకరాల్లో రూ.1,011 కోట్ల రూపాయల వ్యయంతో నేషనల్ లా యూనివర్సిటీ National Law University నిర్మాణ పనులకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆంధ్ర రాష్ట్ర రాజధానిని హైదరాబాద్ కు తరలించే సమయంలోను కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చెయ్యాలని తీర్మానించారని సిఎం జగన్ గుర్తు చేశారు.

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని తాను ఇది వరకే చెప్పినట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తు చేశారు. నేషనల్‌ లా యూనివర్సిటీ నిర్మాణానికి వేగంగా అడుగులు పడాలని కోరుకుంటున్నానని సీఎం జగన్‌ చెప్పారు. నిర్మాణ పనుల్ని వేగంగా పూర్తి చేసి యూనివర్శిటీ అందుబాటులోకి రావాలని అకాంక్ష వ్యక్తం చేశారు.

శ్రీబాగ్ ఒప్పందంలో భాగంగా రాయలసీమ ప్రాంతానికి సరైన న్యాయం జరిగేందుకు నేషనల్ లా యూనివర్శిటి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు రాజధానిని తరలించే సమయంలోనూ హైకోర్టు ఏర్పాటు చెయ్యాలని తీర్మానించారని, అది నెరవేరలేదన్నారు. కర్నూలులో హైకోర్టు పెడతామని ఇది వరకే చెప్పామని దానిని అమలు చేస్తామని పునరుద్ఘాటించారు.

నేషనల్ లా యూనివర్శిటి నిర్మాణానికి వేగంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నట్లు జగన్ చెప్పారు. రూ.1000 కోట్లతో యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. యూనివర్సిటీతో పాటు న్యాయపరమైన అంశాల నిర్వహణ కోసం ఏపీ లీగల్‌ మెట్రాలాజీకల్‌ కమిషన్‌, లేబర్‌ కమిషన్‌, వ్యాట్‌ అప్పిలేట్‌ కమిషన్‌, వక్ఫ్‌ బోర్డ్‌, మానవ హక్కుల కమిషన్‌ కూడా కర్నూలులో ఏర్పాటు అవుతున్నాయని ప్రకటించారు. వీటి ఏర్పాటుతో ఈ ప్రాంతానికి మంచి జరుగుతుందన్నారు. కర్నూలులో ఎన్‍హెచ్‍ఆర్ సీ, లోకాయుక్త, హైకోర్టు భవనాలు నిర్మిస్తామని చెప్పారు.

Whats_app_banner