Geethanjali Incident : గీతాంజలి ఉదంతంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి, రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన
Geethanjali Incident : తెనాలి యువతి గీతాంజలి ఆత్మహత్య ఏపీలో కలకలం రేపుతోంది. ఆమె మృతికి మీరే కారణమంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. గీతాంజలి ఉదంతంపై విచారం వ్యక్తం చేసి సీఎం జగన్...20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
Geethanjali Incident : ఇటీవల ఇంటి పట్టా వచ్చిందని ఆనందంగా చెప్పి సోషల్ మీడియాలో (Social Media)వైరల్ అయిన గీతాంజలి అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. గీతాంజలి ఆత్మహత్యపై ఏపీలో రాజకీయ దుమారం రేగింది. ఆమె ఆత్మహత్యకు మీరే కారణమంటూ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన (TDP Janasena)పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. సోషల్ మీడియా ట్రోలింగ్ కారణంగానే తన ఆత్మహత్య చేసుకుందని గీతాంజలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు... ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని పట్టుకునే పనిలో పడ్డారు.
సీఎం జగన్ దిగ్భ్రాంతి
తెనాలి యువతి గీతాంజలి ఆత్మహత్య (Tenali Geethanjali Suicide)ఘటన పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ కూడా చట్టం వదిలిపెట్టదని సీఎం అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా తన కుటుంబానికి ఎంతో మేలు జరిగిందంటూ గీతాంజలి ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూపై ప్రతిపక్షాలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేయడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందంటూ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
20 లక్షల ఎక్స్ గ్రేషియా
గీతాంజలి ఇద్దరు బిడ్డలకు తల్లి లేని లోటును తీర్చలేకపోయినా వారికి రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని (Ex Gratia)అందిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. గీతాంజలిని సోషల్ మీడియాలో వేధింపులకు(Social Media Trolling) గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడిన సీఎం ఆ కుటుంబానికి అండగా నిలవాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాని చూపించి సంతోషంగా మాట్లాడటమే గీతాంజలి చేసిన తప్పా? అని మంత్రి రోజా ప్రశ్నించారు. ఆమె మరణానికి కారణం అయిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గీతాంజలి కుటుంబానికి అండగా ఉంటామని వైసీపీ నేతలు అంటున్నారు. సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan)ఆదేశాలతో ఆమె నివాసానికి వెళ్తున్న వైసీపీ నేతలు కుటుంబ సభ్యులను ఓదార్చుతున్నారు.
టీడీపీ వాదన ఇలా?
అయితే గీతాంజలి ఆత్మహత్య(Geethanjali)పై టీడీపీ స్పందించింది. గీతాంజలి 7వ తేదీన రైలు ప్రమాదానికి గురైందని, సోషల్ మీడియా(Social Media)లో 8వ తేదీ నుంచి పోస్టులు మొదలయ్యాయని తెలిపింది. వైసీపీ (Ysrcp)ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యిందని ప్రశ్నించింది. గీతాంజలి మృతి వెనుక ఉన్న ఆ ఇద్దరు వైసీపీ నేతలు ఎవరు? అని ప్రశ్నించింది. ఆమె మృతికి కారణం ఎవరో తేలాలని ట్వీట్ చేసింది. రైల్వే స్టేషన్ (Railway Station)లో ఆమెతో పాటు ఉన్న ఆ ఇద్దరు ఎవరు? రైల్వే స్టేషన్ సీసీ కెమెరాల వీడియో బయటపెట్టాలని డిమాండ్ చేసింది. #WhoKilledGeetanjali అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. గీతాంజలి మరణం వెనుక సానుభూతి ఎన్నికల పథకం ఉందని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. గీతాంజలిని ప్రతి రోజూ తాడేపల్లిలోని వైసీపీ సోషల్ మీడియా ఆఫీసుకు తీసుకొచ్చే ఆ ఇద్దరు వైసీపీ నేతలు ఎవరని ప్రశ్నిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీలు బయపపెడితే నిందితులు ఎవరో తెలుస్తుందన్నారు.
సంబంధిత కథనం