Social Media Trolling : ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ (Social Media Viral)అయిన యువతి గీతాంజలి ఆత్మహత్యకు(Geethanjali) పాల్పడింది. ట్రోలింగ్(Trolling) కారణంగానే యువతి ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. ఇటీవల ఇల్లు పట్టా వచ్చిందని, తన ఆనందాన్ని గీతాంజలి మీడియాతో పంచుకుంది. ఈ వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ఆమె వైసీపీ ప్రభుత్వం(Ysrcp Govt) అందించిన సాయంపై మాట్లాడింది. దీంతో కొందరు సోషల్ మీడియా ఆమె ట్రోల్ చేశారు. సోషల్ మీడియా వేధింపులు తట్టుకోలేక యువతి గీతాంజలి ఆత్మహత్య చేసుకుంది. రెండు రోజుల పాటు ఆసుపత్రిలో మరణంతో పోరాడి ఇవాళ చనిపోయింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని #JusticeForGeethanjali #WeStandWithGeethanjali అనే యాష్ ట్యాగ్ లతో ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
గుంటూరు జిల్లా తెనాలికి గీతాంజలి(28) తన కుటుంబంతో కలిసి నివసిస్తుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం పథకంలో ఆమెకు ఇల్లు వచ్చింది. ఇంటి పట్టాను ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో అందించారు. ఇంటి పట్టా అందుకున్న తర్వాత ఆమె మీడియాతో మాట్లాడింది. వైసీపీ ప్రభుత్వం తన కల నెరవేరిందని, తన పిల్లలకు అమ్మ ఒడి వస్తుందని చెప్పింది. ఇతర సంక్షేమ పథకాలు(Welfare Schemes) అందుతున్నాయని ఆనందంతో చెప్పింది. గీతాంజలి మాట్లాడిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. రాజకీయ కారణాలతో వైసీపీ శ్రేణులు ఈ వీడియోను తన ఖాతాల్లో పోస్టు చేయగా... ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారు. గీతాంజలి ఆత్మహత్యకు ట్రోలింగ్ కారణమని వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు ఇంకా స్పందించాల్సి ఉంది.
అయితే ఏం జరిగిందో? కానీ ఇంతలో గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడింది. టీడీపీ, జనసేన శ్రేణుల ట్రోలింగ్(TDP Janasena Trolling) కారణంగానే గీతాంజలి బలవన్మరణానికి పాల్పడిందని వైసీపీ మద్దతుదారులు (Ysrcp Supporters)ఆరోపిస్తున్నారు. గీతాంజలి మరణంతో ఆమె పిల్లలు అన్యాయం అయ్యారు. ఆమెకు న్యాయం చేయాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సామాజిక మాధ్యమాల్లో #JusticeForGeethanjali అని పోస్టులు పెడుతున్నారు. కారణాలు ఏమైనా సరే ట్రోలింగ్ భూతానికి మరో మహిళ బలైపోయింది. సామాన్యుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకూ ఈ సోషల్ మీడియా రక్కసి చేతిలో నిత్యం వేధింపులకు గురవుతున్నారు. రాజకీయపరమైన అంశాలతో అకౌంట్స్ క్రియేట్ చేసుకుని పార్టీలపై నిత్యం దుమ్మెత్తిపోసుకుంటున్నారు.
అధికారం కోసం ఒకరు, అధికారం నిలుపుకోవడం కోసం మరొకరు చేసిన సామాజిక యుద్ధంలో ఓ అబల బలైపోయింది. కారణాలు ఏమైనా కానీ అంతిమంగా నష్టపోయింది గీతాంజలి, ఆమె కుటుంబం. ట్రోలింగ్ కు అడ్డుకట్టవేయాలని ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా? అవి వాస్తవంలో కార్యరూపదాల్చడంలేదు. అధికార పక్షాలే సామాజిక మాధ్యమాల్లో కొన్నిసార్లు పరిధి దాటి ప్రవర్తిస్తున్నాయి. అలాంటప్పుడు బాధ్యులపై ఎలా చర్యలు తీసుకుంటాయని ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికైనా సోషల్ మీడియా ట్రోలింగ్ పై నిఘా ఉండాలన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
సంబంధిత కథనం