Dhanashree Verma: చాహల్ భార్య ధనశ్రీ వర్మ విషయంలో సోషల్ మీడియాలో రచ్చ: ఏం జరిగిందంటే..
Dhanashree Verma: భారత స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మను సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు ఆమెకు మద్దతునిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‍గా మారింది. ఏం జరిగిందంటే..
Dhanashree Verma: స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్‍కు కొంతగాలంగా టీమిండియాలో చోటు దక్కడం లేదు. ఫామ్‍లో ఉన్న సమయంలోనే భారత జట్టులో ప్లేస్ కోల్పోయిన అతడు మళ్లీ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. భారత్ తరఫున చివరగా గతేడాది ఆగస్టులో వెస్టిండీస్‍పై టీ20 ఆడాడు చాహల్. ఆ తర్వాత టీమిండియాకు దూరమయ్యాడు. గతేడాది వన్డే ప్రపంచకప్‍లోనూ చోటు దక్కలేదు. దీంతో పాటు ఇటీవల బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులోనూ చాహల్ చోటు కోల్పోయాడు. కాగా, తాజాగా యజువేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ విషయంలో సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది.
కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉత్కర్‌తో ధనశ్రీ వర్మ ఉన్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. ఈ ఫొటోలో ధనశ్రీ చుట్టూ చేతులు వేసి ప్రతీక్ ఆమెను కౌగిలించుకున్నాడు. ఈ ఫొటోలు ఇద్దరూ చనువుగా కనిపించారు. దీంతో, ధనశ్రీపై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరాయి పరుషుడితో అంత చనువుగా ఉండడమేంటని కొందరు విమర్శిస్తున్నారు.
విమర్శలు.. మద్దతు
కొరియోగ్రాఫర్ ప్రతీక్‍తో ఓ పార్టీలో ధనశ్రీ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ ఫొటోను దిగారు. దీన్ని ప్రతీక్ ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. దీంతో ధనశ్రీ వర్మపై కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. వేరే పురుషుడిని అలా కౌగిలించుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే, మరికొందరు నెటిజన్లు ధనశ్రీకి మద్దతు తెలుపుతున్నారు. ఇందులో తప్పేముందని, స్నేహితులతో సరదాగా ఉంటే ఏమవుతుందని కొందరు పోస్టులు చేస్తున్నారు. ధనశ్రీని టార్గెట్ చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ధనశ్రీ విషయంపై సోషల్ మీడియాలో ఓ రచ్చే నడుస్తోంది.
ఇటీవల జరిగిన ఓ డ్యాన్స్ రియాలిటీ షోలో ఐదుగురు ఫైనలిస్టుల్లో ధనశ్రీ వర్మ కూడా ఉన్నారు. ఫైనల్‍లో ఆమె పర్ఫార్మ్ చేశారు. అయితే, బిగ్‍బాస్ మాజీ కంటెస్టెంట్ మనీషా రాణికి టైటిల్ దక్కింది.
చాహల్ భార్య ధనశ్రీపై గతంలోనూ కొన్నిసార్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జరిగాయి. శ్రేయస్ అయ్యర్ విషయంలోనూ ఆమెపై విమర్శలు వచ్చాయి. చాహల్, ధనశ్రీ విడిపోనున్నారని రూమర్స్ కూడా గతంలో చక్కర్లు కొట్టాయి.
చాహల్‍ను గిర్రున తిప్పిన రెజ్లర్
ఈ క్రమంలో యజువేంద్ర చాహల్‍కు చెందిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో బయటికి వచ్చింది. మహిళా రెజ్లర్ సంగీతం ఫోగట్.. అతడిని భుజాలపై ఎత్తుకొని గిర్రన తిప్పారు. ఆపాలని చాహల్ అడిగినా.. ఆమె అలాగే తిప్పారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.
ఐపీఎల్‍పై చాహల్ ఫోకస్
టీమిండియాలో మళ్లీ చోటు దక్కించుకోవాలని స్పిన్నర్ యజువేంద్ర చాహల్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే, తాజాగా బీసీసీఐ వెల్లడించిన వార్షిక కాంట్రాక్టులోనూ చాహల్ పేరు లేదు. ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్‍పై అతడు దృష్టిసారించాడు. ఐపీఎల్‍లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు చాహల్. ఈ ఏడాది ఐపీఎల్‍లో సత్తాచాటి.. 2024 టీ20 ప్రపంచకప్ కోసం సెలెక్టర్ల చూపు తనవైపు తిప్పుకోవాలని చాహల్ భావిస్తున్నాడు. మరి మళ్లీ చాహల్ భారత జట్టులోకి రాగలడో లేదో వేచిచూడాలి.