(1 / 5)
భారత జట్టు స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ తన వివాహ బంధంలో మరో మైలురాయి దాటాడు. చాహల్, ధనశ్రీ పెళ్లికి నేటితో (డిసెంబర్ 22) మూడు సంవత్సరాలు నిండాయి.
(Instagram)(2 / 5)
2020 డిసెంబర్ 22వ తేదీన చాహల్, ధనశ్రీ వివాహం జరిగింది. దీంతో నేటితో వివాహ బంధంలో వారు నాలుగో ఏడాదిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలను షేర్ చేసి తన శ్రీమతికి శుభాకాంక్షలు చెప్పాడు చాహల్.
(3 / 5)
కరోనా లాక్‍డౌన్ సమయంలో చాహల్, ధనశ్రీకి ఆన్‍లైన్‍లో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో సోషల్ మీడియాలో ధనశ్రీ డ్యాన్స్ వీడియో చూసి ఆమెకు మెసేజ్ చేశాడు చాహల్.
(4 / 5)
తనకు కూడా డ్యాన్స్ నేర్పాలని ధనశ్రీకి మెసేజ్ ద్వారా చాహల్ కోరాడు. ఆ తర్వాత ఆన్‍లైన్ ద్వారానే చాహల్‍కు ధనశ్రీ కొన్ని రోజులు డ్యాన్స్ స్టెప్స్ నేర్పింది. అయితే, ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. ఇద్దరూ ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నారు. ఇలా ఈ ఇద్దరినీ డ్యాన్స్ కలిపింది. 2020 డిసెంబర్ 22న వీరు వివాహం చేసుకున్నారు.
ఇతర గ్యాలరీలు