IRCTC Kedar Badri Tour : 13 రోజుల్లో కేదార్ నాథ్, బద్రీనాథ్ సందర్శన- తెలుగు రాష్ట్రాల నుంచి ఐఆర్సీటీసీ ప్యాకేజీ ఇదే!-irctc tour madurai vijayawada warangal to kedar badri kartik temples 13 days package details ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Irctc Kedar Badri Tour : 13 రోజుల్లో కేదార్ నాథ్, బద్రీనాథ్ సందర్శన- తెలుగు రాష్ట్రాల నుంచి ఐఆర్సీటీసీ ప్యాకేజీ ఇదే!

IRCTC Kedar Badri Tour : 13 రోజుల్లో కేదార్ నాథ్, బద్రీనాథ్ సందర్శన- తెలుగు రాష్ట్రాల నుంచి ఐఆర్సీటీసీ ప్యాకేజీ ఇదే!

Bandaru Satyaprasad HT Telugu
Jun 12, 2024 01:38 PM IST

IRCTC Kedar Badri Kartik Tour : దైవభూమి ఉత్తరాఖండ్ లో ప్రముఖ పుణ్య క్షేత్రాలు కేదార్ నాథ్, బద్రీనాథ్, గుప్తకాశీ, కార్తీక్ కోవిల్ దర్శించుకునేందుకు ఐఆర్సీటీసీ భారత్ గౌరవ్ ట్రైన్ నడుపుతోంది. మధురై నుంచి బయలుదేరే ఈ ట్రైన్ తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్తుంది.

13 రోజుల్లో కేదార్ నాథ్, బద్రీనాథ్ సందర్శన- ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ ఇదే!
13 రోజుల్లో కేదార్ నాథ్, బద్రీనాథ్ సందర్శన- ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ ఇదే!

IRCTC Kedar Badri Kartik Tour : కేదార్ నాథ్, బద్రీనాథ్, కార్తీక్(మురుగన్) కోవిల్ దివ్య క్షేత్రాలను దర్శించుకునేందుకు 13 రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తోంది ఐఆర్సీటీసీ. ఉత్తరాఖండ్ టూరిజం, ఐఆర్సీటీసీ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా కేదార్-బద్రీ-కార్తీక్ యాత్ర అందిస్తోంది. ఈ పర్యటనలో దేవభూమి ఉత్తరాఖండ్‌లోని కార్తికేయ స్వామికి అంకితం చేసిన కార్తీక స్వామి దేవాలయంతో పాటు పూజ్యమైన కేదార్‌నాథ్, బద్రీనాథ్ ధామ్‌లతో పాటు గుప్తకాశీలో పర్యటించవచ్చు. ఈ పర్యటనలో గుప్తకాశీ - కేదార్‌నాథ్ - గుప్తకాశీ మార్గంలో హెలికాప్టర్ సదుపాయం కూడా ఉంది. మధురైలో బయలుదేరే భారత్ గౌరవ్ రైలు తెలుగు రాష్ట్రాల్లో గూడూరు, విజయవాడ, వరంగల్ మీదుగా వెళ్తుంది.

  • 𝐓𝐨𝐮𝐫 𝐍𝐚𝐦𝐞: కేదార్-బద్రీ-కార్తీక్ (మురుగన్) కోవిల్ యతిరై
  • 𝐃𝐮𝐫𝐚𝐭𝐢𝐨𝐧: 12 రాత్రులు/13 రోజులు
  • 𝐎𝐫𝐢𝐠𝐢𝐧 𝐂𝐢𝐭𝐢𝐞𝐬: మధురై, దిండిగల్, తిరుచ్చి, విల్లుపురం, చెన్నై, గూడూరు, విజయవాడ, వరంగల్
  • 𝐓𝐨𝐮𝐫 𝐃𝐚𝐭𝐞: 20.06.2024

పర్యటన ధర (వ్యక్తికి)

వర్గం -సింగిల్/డబుల్/ట్రిపుల్- పిల్లలు (5-11 సంవత్సరాలు)

  • స్టాండర్డ్ రూ. 58,946/- రూ. 58,946/-
  • డీలక్స్ రూ. 62,353/- రూ. 62,353/-

పర్యటన ఇలా : మధురై - రిషికేశ్ - రుద్రప్రయాగ - గుప్తకాశీ - కేదార్‌నాథ్ - జోషిమఠ్ - బద్రీనాథ్

రైలు ప్రయాణం ఇలా : మధురై - దిండిగల్ జంక్షన్ - తిరుచిరాపల్లి - విల్లుపురం - చెన్నై ఎగ్మోర్ - గూడూరు జంక్షన్ - విజయవాడ - వరంగల్ - నాగ్ పూర్ - యోగ్ నగరి రిషికేశ్

బోర్డింగ్/డీబోర్డింగ్ స్టేషన్లు : మధురై, దిండిగల్ జంక్షన్, తిరుచిరాపల్లి, విల్లుపురం, చెన్నై ఎగ్మోర్, గూడూరు జంక్షన్, విజయవాడ, వరంగల్, నాగ్‌పూర్

సీట్ల సంఖ్య : 300 (AC III)

ప్రయాణం సాగేదిలా?

  • 20.06.2024 (గురువారం) - తమిళనాడులో మధురై నుంచి సాయంత్రం 8.00 గంటలకు రైలు ప్రయాణం ప్రారంభమవుతుంది.
  • 21.06.2024 (శుక్రవారం) - ఉదయం 06.00 గంటలకు చెన్నై ఎగ్మోర్ స్టేషన్ లో బోర్డింగ్
  • 22.06.2024 (శనివారం) - రైలు ప్రయాణం
  • 23.06.2024 (ఆదివారం) - యోగ్ నగరి రిషికేశ్ రైల్వే స్టేషన్‌కు ఉదయం 08.00 గంటలకు చేరుకుంటారు. రిషికేశ్‌లో రాత్రి బస చేస్తారు.
  • 24.06.2024 (సోమవారం) - పర్యాటకులు రుద్రప్రయాగకు (140 కిమీ) తరలివెళ్తారు.
  • 25.06.2024(మంగళవారం) - ఇక్కడ ప్రయాణికులను మూడు గ్రూపులుగా చేస్తారు.

Group A : రుద్రప్రయాగ నుంచి గుప్తకాశీ, అక్కడ నుంచి కేదార్‌నాథ్ వరకు హెలీకాఫ్టర్ తీసుకెళ్తారు. తిరిగి గుప్తకాశీ నుంచిహెలీకాఫ్టర్ లో రుద్రప్రయాగకు చేరుకుంటారు.

Group B : రుద్రప్రయాగ నుంచి కార్తీక స్వామి దేవాలయం, గుప్తకాశీ వరకు (మొత్తం రోడ్డు ప్రయాణం 95 కి.మీ) వెళ్తారు.

Group C : రుద్రప్రయాగ నుంచి జోషిమఠానికి వెళ్తారు.

  • 26.06.2024 (బుధవారం)

Group A : రుద్రప్రయాగ నుంచి కార్తీక స్వామి దేవాలయం వెళ్తారు. తిరిగి రుద్రప్రయాగకు చేరుకుంటారు.

Group B : గుప్తకాశీ నుంచి కేదార్‌నాథ్‌కి హెలీకాఫ్టర్ లో వెళ్తారు. తిరిగి గుప్తకాశీ, తర్వాత రుద్రప్రయాగకు చేరుకుంటారు.

Group C : జోషిమఠ్ నుంచి బద్రీనాథ్, అక్కడి నుంచి జోషిమఠ్, రుద్రప్రయాగకు తిరిగి వస్తారు.

  • 27.06.2024 (గురువారం)

Group A : రుద్రప్రయాగ నుంచి జోషిమఠానికి వెళ్తారు.

Group B : రుద్రప్రయాగ నుంచి జోషిమఠ్ ( 115 కి.మీ)

Group C : రుద్రప్రయాగ నుంచి గుప్తకాశీ అక్కడి నుంచి కేదార్‌నాథ్ వరకు హెలీకాఫ్టర్ లో వెళ్తారు. తిరిగి గుప్తకాశీకి, రుద్రప్రయాగకు వెళ్తారు.

  • 28.06.2024 (శుక్రవారం)

Group A : జోషిమఠ్ నుంచి బద్రీనాథ్ వెళ్తారు. తిరిగి జోషిమఠ్ చేరుకుంటారు.

Group B : జోషిమఠ్ నుంచి బద్రీనాథ్, తిరిగి జోషిమఠ్ (మొత్తం 90 కి.మీ )

Group C : రుద్రప్రయాగ నుంచి కార్తీక స్వామి ఆలయానికి వెళ్తారు. తిరిగి రుద్రప్రయాగకు చేరుకుంటారు.

  • 29.06.2024 (శనివారం)

Group A : తిరుగు ప్రయాణం కోసం జోషిమఠ్ నుంచి రిషికేశ్ చేరుకుంటారు.

Group B : తిరుగు ప్రయాణం కోసం జోషిమత్ నుంచి రిషికేశ్ ( 250 కి.మీ ) వెళ్తారు.

Group C : తిరుగు ప్రయాణం కోసం రుద్రప్రయాగ నుంచి రిషికేశ్ చేరుకుంటారు.

  • 30.07.2024 (ఆదివారం)- తిరుగు రైలు ప్రయాణం మొదలు
  • 01.07.2024 (సోమవారం) - పర్యాటకులు చెన్నై ఎగ్మోర్ స్టేషన్ కు చేరుకుంటారు.
  • 02.07.2024 (మంగళవారం) - మధురై చేరుకుంటారు. దీంతో పర్యటన ముగుస్తుంది.

మధురై, తెలుగు రాష్ట్రాలు నుంచి కేదార్ నాథ్-బద్రీనాథ్-కార్తీక్ టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలు కోసం ఈ కింద లింక్ పై క్లిక్ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం