Bharat Gourav Train: భారత్ గౌరవ్ రైలులో బుకింగ్స్ ప్రారంభం..జులై 26న జర్నీ-bookings for the 9th bharat gaurav train have started ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bharat Gourav Train: భారత్ గౌరవ్ రైలులో బుకింగ్స్ ప్రారంభం..జులై 26న జర్నీ

Bharat Gourav Train: భారత్ గౌరవ్ రైలులో బుకింగ్స్ ప్రారంభం..జులై 26న జర్నీ

HT Telugu Desk HT Telugu
Jul 13, 2023 10:05 AM IST

Bharat Gourav Train: ఐఆర్‌సిటిసి ప్రారంభించిన భారత్ గౌరవ్ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో 9వ టూరిస్ట్‌ రైలు బుకింగ్స్‌ ప్రారంభించారు. సికింద్రాబాద్‌ నుంచి పుణ్య క్షేత్ర యాత్ర పేరుతో పూరి-కాశీ-అయోధ్యలకు ప్రత్యేక పర్యాటక రైలును ఐఆర్‌సిటిసి ప్రకటించింది.

భారత్ గౌరవ్ పర్యాటక రైలు
భారత్ గౌరవ్ పర్యాటక రైలు

Bharat Gourav Train: పర్యాటక ప్రాంతాలకు ప్రయాణికులకు తీసుకువెళ్లేందుకు ఐఆర్‌సిటిసి ప్రారంభించిన భారత్ గౌరవ్ రైలుకు ప్రయాణికుల నుంచి ఆదరణ పెరుగుతోంది. దీంతో 9వ విడత పుణ‌్యక్షేత్ర యాత్రను జులై 26న ప్రారంభిస్తున్నట్లు ఐఆర్‌సిటిసిప్రకటించింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రయాణీకులకు దేశంలోని తూర్పు, ఉత్తర భాగంలోని పురాతన మరియు చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించడానికి ఈ పర్యాటక రైలు అవకాశాన్ని కల్పిస్తుంది.ఉత్తర భారతంలోని ముఖ్యమైన యాత్ర మరియు చారిత్రక ప్రదేశాలను కవర్ చేస్తూ ప్రయాణం సాగుతుంది.

తెలంగాణ, ఏపీలోని ఏనిమిది ముఖ్యమైన స్టేషన్లలో ప్రయాణికులకు రాకపోకలు సాగించవచ్చు. టూరిస్ట్ సర్క్యూట్ రైలు తెలంగాణలోని సికింద్రాబాద్ , కాజీపేట , ఖమ్మంతో మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట్ , పెందుర్తి మరియు విజయనగరంలో కూడా రాకపోకలు సాగించడానికి వీలు కల్పిస్తుంది.

భారత గౌరవ్ రైలు పుణ్య క్షేత్ర యాత్ర 9 రోజుల వ్యవధిలో ఉత్తర భారతదేశంలోని పూరి , కోణార్క్ , గయ, వారణాసి, అయోధ్య , ప్రయాగ్‌రాజ్ వంటి స్థలాలను కవర్ చేస్తూ సాగుతుంది.

సికింద్రాబాద్ నుండి ప్రారంభించే యాత్రలో మధ్యలో పలు స్టేషన్ల నుండి కూడా ప్రయాణికులు ఈ రైలు ఎక్కేందుకు వీలు కల్పించారు. ఈ రైలులో అన్ని వర్గాల ప్రయాణికులకు యాత్రలో పాల్గొనేలా కోచ్‌లను ఏర్పాటు చేశారు. 2 ఏ సీ 1 కోచ్, 3ఏసీ- 3 కోచ్‌లు, స్లీపర్ 7 కోచ్‌లతో ప్రత్యేక రైలును నిర్వహిస్తున్నారు.

9వ విడత భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు పుణ్య క్షేత్ర యాత్ర, పూరి-కాశీ-అయోధ్య జూలై 26 2023 నుండి 3 ఆగస్టు, 2023 వరకు సాగుతుంది. పుణ్య క్షేత్ర యాత్రలో భాగంగా పూరి - కోణార్క్ - గయ - వారణాసి - అయోధ్య - ప్రయాగ్‌రాజ్‌ల మీదుగా తిరిగి సికింద్రాబాద్ చేరుకుంటుంది. 26 తేదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 12:00 గంటలకు బయలుదేరుతుంది యాత్ర మొత్తం 8 రాత్రులు, 9 రోజులు పాటు సాగుతుంది.

టిక్కెట్ ధర ఒక్కొక్కరికి ధర జిఎస్టీతో కలిపి ఎకానమీ ప్రయాణానికి స్లీపర్ కోచ్‌లో రూ. 15075 ఛార్జీచేస్తారు. థర్డ్‌ ఏసీలో ప్రయాణానికి రూ. 23875వసూలు చేస్తారు. కంఫర్ట్ కేటగిరీలో 2 ఏసీ ప్రయాణానికి రూ. 31260 వసూలు చేస్తారు.

బుకింగ్‌ల కోసం IRCTC: http://www.irctctourism.com వెబ్‌సైట్‌ని సందర్శించండి

మరింత సమాచారం కోసం హెల్ప్‌లైన్‌లు అందుబాటులో ఉంటాయి.

సికింద్రాబాద్: 040-27702407, 9701360701, 8287932228, 8287932229, 9110712752, 9390112760

విజయవాడ: 8287932319,

తిరుపతి: 8287932313, 8287932317

విశాఖపట్నం: 8287932318, 8287932225

Whats_app_banner