IRCTC Tamilnadu Tour Package : 6 రోజుల్లో తమిళనాడులోని ప్రముఖ దేవాలయాల సందర్శన, హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ-hyderabad to tamilnadu irctc air tour package 6 days trip visit kumbhakonam madhurai rameswaram tanjavur ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Tamilnadu Tour Package : 6 రోజుల్లో తమిళనాడులోని ప్రముఖ దేవాలయాల సందర్శన, హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ

IRCTC Tamilnadu Tour Package : 6 రోజుల్లో తమిళనాడులోని ప్రముఖ దేవాలయాల సందర్శన, హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ

Bandaru Satyaprasad HT Telugu
May 12, 2024 01:44 PM IST

IRCTC Tamilnadu Tour Package : హైదరాబాద్ నుంచి తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలను దర్శించుకునేందుకు ఐఆర్సీటీసీ 6 రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తోంది.

తమిళనాడులోని ప్రముఖ దేవాలయాల సందర్శన
తమిళనాడులోని ప్రముఖ దేవాలయాల సందర్శన

IRCTC Tamilnadu Tour Package : తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలను దర్శించుకోవాలని అనుకుంటున్నారా? అయితే హైదరాబాద్ నుంచి ట్రెజర్స్ ఆఫ్ తమిళనాడు ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఆరు రోజుల్లో తమిళనాడులోని కుంభకోణం, మధురై, రామేశ్వరం, తంజావూరు వంటి ప్రముఖ ప్రాంతాలు, దేవాలయాలను సందర్శించవచ్చు. రూ.29,250 ప్రారంభ ధరతో హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ ఎయిర్ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఆగస్టు 13 నుంచి 18 మధ్యలో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. మొత్తం 29 టికెట్లతో ఎయిర్ టూర్ అందిస్తోంది ఐఆర్సీటీసీ.

విమాన వివరాలు

తేదీఫ్లైట్ నెం.నుంచి బయలుదేరు సమయంఎక్కడికి చేరుకునే సమయం
13.08.20246E2073హైదరాబాద్04.25 PMతిరుచ్చి05-50 PM
18.08.20246E6782మధురై05.05 PMహైదరాబాద్06.40 PM

ఒక్కో వ్యక్తికి ప్యాకేజీ ఖర్చు :

సింగిల్ ఆక్యుపెన్సీడబుల్ ఆక్యుపెన్సీట్రిపుల్ ఆక్యుపెన్సీచైల్డ్ విత్ బెడ్(5-11 సంవత్సరాలు)చైల్డ్ వితవుట్ బెడ్(5-11 సంవత్సరాలు)చైల్డ్ వితవుట్ బెడ్(2-4 సంవత్సరాలు)
రూ.39850రూ.30500రూ.29250రూ.26800రూ.22600రూ.16800

పర్యటన సాగేదిలా :- తిరుచ్చి - తంజావూరు - కుంభకోణం - రామేశ్వరం - మధురై

పర్యటన వివరాలివే

  • డే 1 : హైదరాబాద్ - తిరుచ్చి

మధ్యాహ్నం హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరుతారు. సాయంత్రానికి తిరుచ్చి చేరుకుంటారు. ఎయిర్ పోర్టులో పికప్ చేసుకుని హోటల్‌కి తీసుకెళ్తారు. రాత్రి బస తిరుచ్చిలో చేస్తారు.

  • డే 2 : తిరుచ్చి - తంజావూరు - కుంభకోణం

బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ చెక్ అవుట్ చేస్తారు. శ్రీరంగం ఆలయాన్ని, జంబుకేశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం తంజావూరుకు(60 కి.మీ.) బయలుదేరి వెళ్తారు. అక్కడ బృహదీశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం కుంభకోణం (40 కి.మీ.)కి బయలుదేరి వెళ్తారు. అక్కడ ఐరావతేశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రికి కుంభకోణంలోని హోటల్‌ లో బస చేస్తారు.

  • డే 3 : కుంభకోణం – చిదంబరం – కుంభకోణం

హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ తర్వాత చిదంబరానికి(70 కి.మీ) బయలుదేరి వెళ్తారు. అక్కడ నటరాజ స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. తర్వాత గంగైకొండ చోళపురం (50 కి.మీ.) వెళ్తారు. మధ్యాహ్నం తిరిగి కుంభకోణం (30 కి.మీ) చేరుకుంటారు. కుంభకోణంలోని స్థానిక ఆలయాలను(కాశీ విశ్వనాథర్, సారంగపాణి, ఆది కుంభేశ్వర ఆలయం) సందర్శిస్తారు. రాత్రికి కుంభకోణంలో బస చేస్తారు.

  • డే 4 : కుంభకోణం - రామేశ్వరం

హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసి చెక్ అవుట్ చేస్తారు. రామేశ్వరం (290 కి.మీ.)కి బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నానికి రామేశ్వరం చేరుకుంటారు. హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. ఆ తర్వాత రామనాథస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రి రామేశ్వరంలో బస చేస్తారు.

  • డే 5 : రామేశ్వరం - మధురై

ఉదయాన్నే దనుష్కోడిని సందర్శిస్తారు. అనంతరం హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది. అబ్దుల్ కలాం మెమోరియల్‌ని సందర్శిస్తారు. ఆ తర్వాత మధురైకి బయలుదేరి (170 కి.మీ) వెళ్తారు. రాత్రికి మధురైలో బస చేస్తారు.

  • డే 6 : మధురై - హైదరాబాద్

హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసిన అనంతరం మీనాక్షి ఆలయం దర్శనానికి వెళ్తారు. దర్శనం అనంతరం మధ్యాహ్నం మధురై ఎయిర్ పోర్టులో డ్రాప్ చేస్తారు. ఫ్లైట్ లో సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో పర్యటన ముగుస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం