NG Ranga Agricultural Courses : ఎన్జీరంగా వర్సిటీలో అగ్రికల్చరల్ ఆన్ లైన్ సర్టిఫికెట్ కోర్సులు, ఇలా దరఖాస్తు చేసుకోండి-guntur ng ranga agricultural certificate courses online mode apply process ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ng Ranga Agricultural Courses : ఎన్జీరంగా వర్సిటీలో అగ్రికల్చరల్ ఆన్ లైన్ సర్టిఫికెట్ కోర్సులు, ఇలా దరఖాస్తు చేసుకోండి

NG Ranga Agricultural Courses : ఎన్జీరంగా వర్సిటీలో అగ్రికల్చరల్ ఆన్ లైన్ సర్టిఫికెట్ కోర్సులు, ఇలా దరఖాస్తు చేసుకోండి

Bandaru Satyaprasad HT Telugu
May 28, 2024 05:45 PM IST

NG Ranga Agricultural Courses : ఎన్జీ రంగా యూనివర్సిటీలో అగ్రికల్చరల్ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానించారు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో ఈ కోర్సును అభ్యసించవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 30లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎన్జీరంగా వర్సిటీలో అగ్రికల్చరల్ ఆన్ లైన్ సర్టిఫికెట్ కోర్సులు
ఎన్జీరంగా వర్సిటీలో అగ్రికల్చరల్ ఆన్ లైన్ సర్టిఫికెట్ కోర్సులు

NG Ranga Agricultural Courses : గుంటూరు ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీలో అగ్రికల్చరల్ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానించారు. జూన్ 30లోపు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గుంటూరులోని బాపట్లలో ఉన్న ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రం అగ్రికల్చరల్ సర్టిఫికెట్ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. జులైలో అగ్రికల్చరల్ సర్టిఫికెట్ కోర్సులు‌ ప్రారంభం కానున్నాయి. ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు సంబందించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ కె.గురవారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

yearly horoscope entry point

జీవ ఎరువుల తయారీ, నిర్వహణ, పట్టుపురుగుల పెంపకం, మిద్దె తోటలు పెంపకం వంటి సర్టిఫికెట్ కోర్సులను ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రం(Distance Education) ద్వారా అందిస్తుంది. ఈ కోర్సుల కాల వ్యవధి రెండు నెలలు పాటు లేదా ఎనిమిది వారాల పాటు ఉంటుంది. జులై నుంచి సెప్టెంబర్ వరకు కోర్సులు నిర్వహిస్తారు. అలాగే ఆన్‌లైన్ లో కోర్సులను నిర్వహిస్తారు. అభ్యర్థులు తప్పనిసరిగా కంప్యూటర్ లేదా ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఉండాలని యూనివర్సిటీ సిబ్బంది తెలిపారు. ప్రతి కోర్సుకు ఏడు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తారు. ఒక ప్రాక్టికల్ క్లాస్ మాత్రం స్టడీ సెంటర్‌లో ఉంటుంది. ఆ తరువాత ఫైనల్ ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది.

ఫీజు వివరాలు

పరీక్షలు తెలుగులో రాసేవారికి కూడా తెలుగు సర్టిఫికెట్ కోర్సుకు అర్హులు. కోర్సులు చదవడానికి ఎటువంటి వయస్సు పరిమితి లేదు. ఈ కోర్సుల్లో చేరాలనుకునేవారు జూన్ 30 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కొ కోర్సుకు రూ.1,500 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజును (favour of OPEN AND DISTANCE LEARNING CENTRE, ANGRAU, payable at Guntur, A.P) పేరుతో డీడీ తీయాలి.

ఆన్ లైన్ చెల్లింపులు

  • ఒకవేళ ఆన్‌లైన్ లో ఫీజు చెల్లించాలనుకునే వారు:
  • బ్యాంక్ పేరు: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • అకౌంట్ నెంబర్: 031410100093292
  • ఐఏఫ్ఏస్సీ కోడ్: UBIN0803146
  • బ్రాంచ్ : కొరిటిపాడు, గుంటూరుకు ఫీజు చెల్లించవచ్చు. అయితే రిజిస్ట్రేషన్ ఫీజును తిరిగి చెల్లించరు.

పోస్ట్ చేయాల్సిన అడ్రస్

ఆసక్తి కలవారు దరఖాస్తు చేసుకోవాలంటే, యూనివర్సిటీ వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ అప్లికేషన్ ను పూర్తి చేసి, దానికి ఫీజు చెల్లించిన డీడీని జత చేసి OPEN DISTANCE LEARNING CENTRE, O/O DEAN OF AGRICULTURE, ACHARYA N G RANGA AGRICULTURAL UNIVERSITY, ADMINISTRATIVE OFFICE BUILDING, LAM, GUNTUR – 522034 అడ్రస్ కి పోస్టు చేయాలని నోటిఫికేషన్ లో తెలిపారు.

ఈ కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ www.angrau.ac.in ని సందర్శించండి. అలాగే angrau.odlc@gmail.com, మొబైల్ నంబర్ 8008788776ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం