AP Pensions Distribution: బ్యాంకు ఖాతాలకే మే నెల సామాజిక పెన్షన్ల సొమ్ము, నిధులు విడుదల చేసిన ప్రభుత్వం-government has released welfare pension money and funds for the month of may to the bank accounts only ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Pensions Distribution: బ్యాంకు ఖాతాలకే మే నెల సామాజిక పెన్షన్ల సొమ్ము, నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

AP Pensions Distribution: బ్యాంకు ఖాతాలకే మే నెల సామాజిక పెన్షన్ల సొమ్ము, నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

Sarath chandra.B HT Telugu
May 30, 2024 05:57 AM IST

AP Pensions Distribution: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ద్వారా సామాజిక పెన్షన్లు అందుకుంటున్న లబ్దిదారులకు మే నెల పెన్షన్ డబ్బు విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా నగదు బదిలీ పథకం లబ్దిదారుల ఖాతాలకు జూన్1న పెన్షన్ డబ్బులు జమ కానున్నాయి.

బ్యాంకు ఖాతాల్లోనే మే నెల పెన్షన్లు, నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
బ్యాంకు ఖాతాల్లోనే మే నెల పెన్షన్లు, నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

saraAP Pensions Distribution: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సామాజిక భద్రతలో భాగంగా అందిస్తోన్న సంక్షేమ పెన్షన్ల డబ్బులు విడుదలయ్యాయి. మే నెల పెన్షన్ల సొమ్మును బుధవారం విడుదల చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఇంటింటి పంపిణీపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని 65,30,808 మంది పెన్షనర్లకు పంపిణీ చేసేందుకు రూ.1939.35 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.

జూన్ 1న ప్రత్యక్ష నగదు బదిలీ(DBT) ద్వారా 47,74,733మందికి పెన్షన్లు చెల్లించనున్నారు. మొత్తం పెన్షనర్లలో 73.11% మందికి బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేయనున్నారు. 1 జూన్ నుండి 5 జూన్ వరకు డోర్-టు-డోర్ డెలివరీ ద్వారా 17,56,105మందికి పెన్షన్లను అందిస్తారు. మొత్తం పెన్షనర్లలో 26.89% మందికి ఇంటికే వెళ్లి పంపిణీ చేయనున్నారు.

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఎన్నికల నియమావళిని పాటిస్తూ పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా పెన్షన్ పంపిణీ చేయాలని కలెక్టర్లకు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశి భూషణ్ కుమార్ ఆదేశించారు.

మే నెల భద్రతా పెన్షన్లకు సంబంధించిన మొత్తం రూ.1939.35 కోట్లు విడుదల చేసినట్లు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశి భూషణ్ కుమార్ వెల్లడించారు. ఎన్నికల కోడ్‌ పాటిస్తూ పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆయన ఆదేశించారు..

మే నెలకు సంబంధించి 65,30,808 పెన్షన్లలో 47,74,733 పెన్షన్లు (73.11%) ప్రత్యక్ష నగదు బదిలీ(DBT) పద్ధతి ద్వారా మరియు 17,56,105 పెన్షన్లు (26.89%) డోర్-టు-డోర్ పంపిణీ పద్ధతి ద్వారా చెల్లించనున్నారు.

పెన్షన్‌దారుల బ్యాంక్ ఖాతాల్లోకి జూన్ 1, 2024 న నేరుగా ప్రత్యక్ష నగదు బదిలీ (DBT) ద్వారా సొమ్ము జమ చేస్తారు. వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి ఇంటి వద్ద పెన్షన్ అందజేసేలా పంచాయతీ కార్యదర్శులు/ వార్డు పరిపాలనా కార్యదర్శులు బ్యాంకు శాఖల నుండి మే 31, 2024న పెన్షన్ నగదును డ్రా చేసి, పెన్షన్లను పంపిణీ ప్రక్రియను నిర్వహిస్తున్న ఇతర గ్రామ/వార్డు కార్యాలయ సిబ్బందికి అప్పగించాలని ఆదేశించారు.

పెన్షన్లను నగదు రూపంలో చెల్లించే వారికి, సచివాలయ సిబ్బంది 1 జూన్ నుండి 5 జూన్, 2024 వరకు డోర్-టు-డోర్ పద్ధతిలో పంపిణీ చేయాలని సూచించారు. పెన్షన్ల పంపిణీ కోసం ఏప్రిల్ 28న జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించాలని స్పష్టం చేశారు.

ఏపీలో గత రెండు నెలలుగా బ్యాంకు ఖాతాలకే పెన్షన్లను జమ చేస్తున్నారు. వాలంటీర్ల సేవల్ని వినియోగించుకోవడంపై రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ నిబంధనలు అమలు చేస్తున్నారు.

ఏప్రిల్ 28, 2024న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మెమో నం. 2391982/RD.I/A1/2024 ద్వారా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల నియమావళిని పాటిస్తూ, పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ పంపిణీ సజావుగా నిర్వహించాలని కలెక్టర్లకు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సూచించారు.

Whats_app_banner

సంబంధిత కథనం