AP DGP Oders: రోజూ ఆఫీసు రావాల్సిందే, వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లకు డీజీపీ ఆర్డర్, అటెండెన్స్‌ సంతకాలు చేయాలని ఆదేశం-dgp ordered to come to office daily waiting ipss to sign attendance orders ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Dgp Oders: రోజూ ఆఫీసు రావాల్సిందే, వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లకు డీజీపీ ఆర్డర్, అటెండెన్స్‌ సంతకాలు చేయాలని ఆదేశం

AP DGP Oders: రోజూ ఆఫీసు రావాల్సిందే, వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లకు డీజీపీ ఆర్డర్, అటెండెన్స్‌ సంతకాలు చేయాలని ఆదేశం

Sarath chandra.B HT Telugu
Aug 14, 2024 02:06 PM IST

AP DGP Oders: ఏపీలో పోస్టింగ్‌లో లేకుండా నిరీక్షణలో ఉన్నసీనియర్ ఐపీఎస్‌ అధికారులకు డీజీపీ షాక్ ఇచ్చారు. వెయిటింగ్‌లో ఉన్న అధికారులంతా నిత్యం ఆఫీసుకు రావాల్సిందేనని మెమో జారీ చేశారు. ఉదయం పది నుంచి సాయంత్రం వరకు ఆఫీసులో అందుబాటులో ఉండాలని ఉత్తర్వులు జారీ చేశారు.

వెయిటింగ్ ఐపీఎస్‌లకు డీజీపీ ఆదేశాలు
వెయిటింగ్ ఐపీఎస్‌లకు డీజీపీ ఆదేశాలు

AP DGP Oders: ఏపీలో వైసీపీ ప్రభుత్వంతో అంటకాగారనే ఆరోపణలతో పోస్టింగ్‌లకు దూరమైన ఐపీఎస్‌ అధికారులపై డీజీపీ చర్యలు చేపట్టారు. పోస్టింగ్‌ లేకపోవడంతో ఆఫీసుకు రాకుండా కాలక్షేపం చేస్తున్న ఐపీఎస్‌లపై కొరడా ఝుళిపించారు. హెడ్‌ క్వార్టర్లు విడిచి వెళ్లకూడదనే ఆదేశాలను పాటించకుండా పలువురు ఐపీఎస్‌లు ఇతర ప్రాంతాల్లో ఉండటంతో చర్యలు చేపట్టారు. వెయిటింగ్‌లో ఉన్న అధికారులు రోజూ ఉదయం పదికల్లా ఆఫీసుకు రావాలని ఆదేవించారు.

పోస్టింగ్‌ లేకుండా వెయిటింగ్‌లో ఉన్నా ఐపీఎస్‌లు ఇకపై రోజూ డీజీపీ ఆఫీసులో హాజరు కావాలని ఆదేశిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. పత్తా లేకుండా పోయిన డీజీ స్థాయి నుంచి పలు హోదాల్లో ఉన్న ఐపీఎస్‌లు ఈ జాబితాలో ఉన్నారు. మొత్తం 16మంది పేర్లతో కూడిన జాబితాతో డీజీపీ మెమో జారీ చేశారు. వీరంతా ఇకపై డీజీపీ కార్యాలయంలో రోజూ అటెండెన్స్‌ నమోదు చేయాల్సి ఉంటుంది.

పోస్టింగ్‌ లేకపోవడంతో విధులకు హాజరు కాని ఐపీఎస్‌లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వీరిలో డీజీ స్థాయి అధికారులు పీవీ సునీల్‌ కుమార్‌, పిఎస్సార్‌ ఆంజనేయులు సహా 16మంది ఐపీఎస్‌లు ఇకపై రోజూ డీజీపీ ఆఫీసుకు రావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఆఫీసర్స్‌ వెయిటింగ్‌ హాల్లో ఉన్న అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేయాలని మెమోలో పేర్కొన్నారు. ఉదయం పది నుంచి అందుబాటులో ఉండాలని విధులు ముగించుకుని వెళ్లే సమయంలో సమయం నమోదు చేయాలని అత్యవసర విధుల కేటాయింపుకు డీజీపీకి అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.

వెయిటింగ్‌లో ఉన్న వారిలో డీజీ క్యాడర్‌లో ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్సార్ ఆంజనేయులు, మాజీ సీఐడీ చీఫ్‌ పీవీ సునీల్ కుమార్‌, అదనపు డీజీ సిఐడి మాజీ చీఫ్‌ ఎన్‌.సంజయ్, విజయవాడ మాజీ సీపీ తాతా కాంతిరాణా, ఐజీ పాలరాజు, సీఐడీ ఐజీ కొల్లి రఘురామిరెడ్డి, డిఐజి అమ్మిరెడ్డి, సిహెచ్‌ విజయరావు, విశాల్‌ గున్నీ, ఎస్పీ క్యాడర్‌లో ఉన్న అన్బురాజన్‌, రవిశంకర్‌ రెడ్డి, రిషాంత్ రెడ్డి, రఘువీరా రెడ్డి, పరమేశ్వర్‌ రెడ్డి, జాషువా, కృష్ణకాంత్‌ పాటిల్‌సంజయ్, కొల్లి రఘురామరెడ్డి, సంజయ్ ఉన్నారు.