CM Chandrababu : అర్చకులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్-వేతనం రూ.15 వేలకు పెంపు, వేద విద్యార్థులకు రూ.3 వేల నిరుద్యోగ భృతి-cm chandrababu good news archakas honorarium 15k veda students get 3k financial assistance ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Chandrababu : అర్చకులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్-వేతనం రూ.15 వేలకు పెంపు, వేద విద్యార్థులకు రూ.3 వేల నిరుద్యోగ భృతి

CM Chandrababu : అర్చకులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్-వేతనం రూ.15 వేలకు పెంపు, వేద విద్యార్థులకు రూ.3 వేల నిరుద్యోగ భృతి

Bandaru Satyaprasad HT Telugu
Aug 27, 2024 09:44 PM IST

CM Chandrababu : అర్చకులకు సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. మేనిఫెస్టో హామీల మేరకు అర్చకులకు వేతనం రూ.15 వేలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తం రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతూ ఆదేశాలిచ్చారు.

అర్చకులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్-వేతనం రూ.15 వేలకు పెంపు, వేద విద్యార్థులకు రూ.3 వేల నిరుద్యోగ భృతి
అర్చకులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్-వేతనం రూ.15 వేలకు పెంపు, వేద విద్యార్థులకు రూ.3 వేల నిరుద్యోగ భృతి

CM Chandrababu : మేనిఫెస్టోలోని మరో హామీ అమలు దిశగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం సచివాలయంలో దేవాదాయశాఖపై సమీక్ష నిర్వించిన ముఖ్యమంత్రి... కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఈ సమీక్షలో అర్చకులకు శుభవార్త చెప్పారు. రూ.10 వేలు వేతనం వచ్చే అర్చకులకు ఇకపై రూ. 15 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తం రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. నిరుద్యోగ వేద విద్యార్థులకు నెలకు రూ. 3 వేలు భృతి ఇవ్వాలని నిర్ణయించారు. నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం రూ. 25 వేలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

దేవాలయాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరియాలని, అపచారాలకు చోటు ఉండకూడదని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దేవాలయాల దగ్గర బలవంతపు మత మార్పిడులు, అన్యమతస్థుల ప్రచారం చేయకూడదని, భక్తుల మనోభావాలకు, ఆగమశాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దేవాలయాల్లో పరిశుభ్రత, ప్రసాదంలో నాణ్యత, ప్రశాంత వాతావరణం కనిపించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

రిలీజియస్ టూరిజం ప్రమోషన్ కు మంత్రుల కమిటీ

రిలీజియస్ టూరిజం ప్రమోషన్ కోసం దేవాదాయ, ఫారెస్ట్, టూరిజం శాఖల మంత్రులతో కమిటీ వేయనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. దేవాలయాల ట్రస్ట్ బోర్డులో అదనంగా మరో ఇద్దరికి అవకాశం కల్పించనున్నామన్నారు. సీజీఎఫ్ కింద, శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా జరిగే పనుల్లో ప్రారంభం కాని పనులు నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చారు. దేవాలయ ఆస్తుల పరిరక్షణకు కమిటీల ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సింహాచలం పంచగ్రామాల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత కథనం