TS Temples Honorarium : అర్చకులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్, ధూపదీప నైవేద్యం అలవెన్స్ రూ.10 వేలకు పెంపు-ts govt hikes temples allowances to rs 10k endowments department related orders ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Temples Honorarium : అర్చకులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్, ధూపదీప నైవేద్యం అలవెన్స్ రూ.10 వేలకు పెంపు

TS Temples Honorarium : అర్చకులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్, ధూపదీప నైవేద్యం అలవెన్స్ రూ.10 వేలకు పెంపు

Bandaru Satyaprasad HT Telugu
Aug 29, 2023 06:05 PM IST

TS Temples Honorarium : ధూపదీప నైవేద్యం కింద అర్చకులకు ఇచ్చే అలవెన్స్ తెలంగాణ ప్రభుత్వం పెంచింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

TS Temples Honorarium : తెలంగాణ ప్రభుత్వం అర్చకులకు గుడ్ న్యూస్ చెప్పింది. ధూపదీప నైవేద్యం కింద ఇచ్చే మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ ధూపదీప నైవేద్యం కోసం నెలకు ఇచ్చే మొత్తం రూ.6000 నుంచి పది వేల రూపాయలకు పెంచింది. ఆలయానికి రూ.4000, అర్చకులకు గౌరవ వేతనం రూ.6000 ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇటీవల విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ అర్చకులు ఇచ్చిన హామీ నెరవేర్చారు. ముఖ్యమంత్రి హామీకి అనుగుణంగా దేవాదాయ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

2015లో 6 వేలకు

ధూపదీప నైవేద్యం కోసం పండితులకు ప్రతి నెల ఇచ్చే గౌరవ భృతిని 2015లో రూ.2500 నుంచి రూ.6000 పెంచినట్లు దేవాదాయ శాఖ కమిషనర్ తెలిపారు. ఈ మొత్తంలో రూ.2000 ధూపదీమ నైవేద్యం కోసం, రూ.4000 అర్చకులకు అందించేవారు. ఇటీవల విప్రహిత బ్రహ్మణ సంక్షేమ భవనం ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ ను బ్రహ్మణ సంఘాలు ధూపదీప నైవేద్యం గౌరవ వేతనాన్ని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచాలని కోరారు. అర్చకుల విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి... ధూపదీప నైవేద్యం పథకం ద్వారా అర్చకులు గౌరవ భృతిని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో రూ.4 వేలు నైవేద్యం కోసం, రూ.6 వేలు అర్చకులకు గౌరవ వేతనం కింద అందించాలని దేవాదాయ శాఖ సూచించింది.

సీఎం కేసీఆర్ హామీ

రాష్ట్రంలోని 3,645 ఆలయాలకు ధూప‌దీప నైవేద్య ప‌థ‌కం అమలుచేస్తున్నారు. త్వరలో మ‌రో 2,796 దేవాల‌యాల‌కు ఈ ప‌థ‌కాన్ని విస్తరింప‌జేస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ తెలిపారు. దీంతో 6,441 ఆలయాలకు ధూప‌దీప నైవేద్యం కింద నిర్వహ‌ణ వ్యయం అందిస్తామన్నారు. ఇప్పటి వరకూ ధూప‌దీప నైవేద్యం ప‌థ‌కం కింద దేవాల‌యాల నిర్వహణ కోసం అర్చకుల‌కు నెల‌కు రూ. 6 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ మొత్తాన్ని రూ. 10 వేల‌కు పెంచుతున్నామ‌ని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సీఎం హామీ మేరకు దేవాదాయ శాఖ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ 2009లో ధూప దీప నైవేద్యం పథకం అమల్లోకి తెచ్చింది. ముందుగా అర్చకులకు నెలకు రూ. 2500 వేతనంగా ఇచ్చారు. ఈ వేతనాలు అర్చకులకు, ఆలయాల నిర్వహణకు ఏ మాత్రం సరిపోని కారణంగా 2015 జూన్‌ 2 నుంచి ధూపదీప నైవేద్యాల కింద అందజేస్తున్న వేతనాలు రూ. 6 వేలకు పెంచారు. ప్రస్తుతం పెరిగిన ఖర్చులతో ఇది కూడా సరిపోదని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం మరోసారి ధూపదీప నైవేద్యం కింద ఇచ్చే వేతనాలను రూ.10 వేలకు పెంచింది.

Whats_app_banner