AP Govt Jobs 2024 : ఏపీ ఉపాధి, శిక్షణ శాఖలో 71 ఉద్యోగ ఖాళీలు - అర్హతలు, ముఖ్య తేదీలివే
APETD Recruitment Notification 2024: ఏపీ ప్రభుత్వం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్ లో ఒప్పంద ప్రాతిపదికన పలు ఐటీఐల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ (ATO) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తులకు మార్చి 30వ తేదీ తుది గడువుగా ఉంది.
APETD Recruitment Notification 2024 Updates: ఏపీ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. పలు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ(ITI)ల్లో అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 71 ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నాయి. వీటిని కాంట్రాక్ట్ ప్రాతిపాదికన రిక్రూట్ చేస్తున్నారు. ఈ మేరకు ఏపీ ఉపాధి, శిక్షణ శాఖ వివరాలను వెల్లడించింది. దరఖాస్తుల ప్రక్రియ మార్చి 1వ తేదీనే ప్రారంభం కాగా... మార్చి 20వ తేదీలోపు ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్లను సమర్పించుకోవచ్చు. మే 6వ తేదీన ఎగ్జామ్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలను ఇక్కడ చూడండి...
ముఖ్య వివరాలు:
రిక్రూట్ మెంట్ ప్రకటన - ఏపీ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్
ఉద్యోగాలు -అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్(ATO)
మొత్తం ఖాళీలు -71
జోన్ల వారీగా పోస్టులు - జోన్ -1లో ట్రేడ్‌ల వారీగా ఖాళీలు చూస్తే డ్రెస్ మేకింగ్- 01, మెషినిస్ట్- 01. ఫిట్టర్- 2, కార్పెంటర్- 1,వెల్డర్- 01 పోస్టు ఉంది. ఇక జోన్ 2లో చూస్తే ఇంజినీరింగ్ డ్రాయింగ్- 01, టర్నర్- 03,మెషినిస్ట్- 01, మెకానిక్ డీజిల్- 1, ఫిట్టర్- 1, మ్యాథ్స్ కమ్ డ్రాయింగ్- 01 ఉద్యోగాలు ఉన్నాయి. జోన్ 3లో డ్రాఫ్ట్స్‌మ్యాన్ సివిల్- 02, ఫిట్టర్- 01 పోస్టులు ఉండగా... జోన్ 4 లో 54 ఖాళీలు ఉన్నాయి. ఈ వివరాలను వెబ్ సైట్ లో చూడొచ్చు.
అర్హతలు - సంబంధిత కోర్సుల్లో బి.ఒకేషనల్/ డిగ్రీ/ డిప్లొమా/ ఎన్‌టీసీ / ఎన్‌ఏసీ ఉత్తీర్ణత పొందాలి. పని అనుభవం కూడా ఉండాలి. పోస్టును అనుసరించి నోటిఫికేషన్ లో వివరాలను పొందుపరిచారు.
వయోపరిమితి - 30/09/2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్లను బట్టి వయోసడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం - ఆన్ లైన్
దరఖాస్తు ఫీజు - రూ.500 చెల్లించాలి.
దరఖాస్తులు ప్రారంభం - మార్చి 01,2024.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ - మార్చి 20, 2024.
ఎంపిక విధానం - రాత పరీక్ష తో పాటు ప్రాక్టికల్ డెమో కూడా ఉంటుంది.
ఎగ్జామ్ విధానం - రాత పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో రాత పరీక్షకు 70 మార్కులు, అనుభవానికి 10 మార్కులు, ట్రేడ్‌లో ప్రాక్టికల్ డెమోకు 20 మార్కులు కేటాయించారు. ఇందులో వచ్చే స్కోరింగ్ ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు.
పరీక్ష జరిగే తేదీ: 06,మే, 2024.
అధికారిక వెబ్ సైట్ - http://detrecruitments.apcfss.in/
ANGRAU Jobs : ఆచార్య ఎన్.జి. రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ విడుదలైంది. ఫిజికల్ డైరెక్టర్ పోస్టు భర్తీకి వాక్-ఇన్-ఇంటర్వ్యూ నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హతలు కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావచ్చని సూచించారు. అభ్యర్థులు M.P.Ed/ PhD (ఫిజికల్ ఎడ్యుకేషన్) అర్హత కలిగి ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. పీహెచ్.డి (ఫిజికల్ ఎడ్యుకేషన్) అభ్యర్థికి నెలకు రూ.38 వేలు చెల్లించనున్నారు. ఎంపీ.ఎడ్ హోల్డర్లకు రూ.33 వేలు చెల్లిస్తారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 5న ఉదయం 11 గంటలకు మహానంది అగ్రికల్చరల్ కాలేజీలో వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు.