RFCL Jobs: రామగుండం ఫెర్టిలైజర్స్‌లో ప్రొఫెషనల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్, నెలాఖరు వరకు గడువు-notification for professional jobs in ramagundam fertilizers ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rfcl Jobs: రామగుండం ఫెర్టిలైజర్స్‌లో ప్రొఫెషనల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్, నెలాఖరు వరకు గడువు

RFCL Jobs: రామగుండం ఫెర్టిలైజర్స్‌లో ప్రొఫెషనల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్, నెలాఖరు వరకు గడువు

Sarath chandra.B HT Telugu
Mar 04, 2024 11:24 AM IST

RFCL Jobs: రామగుండం Ramagundam ఫెర్టిలైజర్స్‌ Fertilizersలో ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

రామగుండం ఫెర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు
రామగుండం ఫెర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు

RFCL Job Notification: రామగుండం ఫెర్టిలైజన్స్‌Fertilizers అండ్ కెమికల్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్, ఈఐఎల్‌, ఎఫ్‌సిఐఎల్‌ జాయింట్ వెంచర్‌ సంస్థ అయిన రామగుండంఫెర్టిలైజర్స్‌ కంపెనీలో అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మార్చి 31వ తేదీలోగా దరఖాస్తులు చేయాల్సి ఉంటుంది. విద్యార్హతలు, వయసు, అనుభవం వివరాలను పూర్తి నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

నేషనల్ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్‌, ఫెర్టిలైజర్స్‌ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్‌ వెంచర్‌గా రామగుండంలో నిర్వహిస్తున్న ఫెర్టిలైజర్స్‌ కంపెనీలో రోజుకు 2200 మెట్రిక్ టన్నుల గ్యాస్ ఆధారిత అమ్మోనియా, 3850 మెట్రిక్ టన్నుల నీమ్ కోటెడ్ యూరియా ఉత్పత్తి చేస్తారు.

తాజా నోటిఫికేషన్‌లో పలు రకాల ప్రొఫెషనల్ ఉద్యాగాలను భర్తీ చేయనున్నారు.రామగుండంతో పాటు ఫెర్టిలైజర్స్ ప్లాంట్లలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

తాజా నోటిఫికేషన్‌లో కెమికల్ Chemicalవిభాగంలో ఇంజనీర్ పోస్టులు 11, మెకానికల్ ఇంజనీర్ పోస్టులు 5, ఎలక్ట్రికల్ ఇంజనీర్ పోస్టులు 2, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ పోస్టులు 1, సీనియర్ కెమిస్ట్ కెమికల్ ల్యాబ్ 2 పోస్టులు, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు 5, మెడికల్ ఆఫీసర్ పోస్టులు 1 భర్తీ చేస్తారు. మొత్తం 27 ఉద్యోగాలను తాజా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలు రూ.40,000-రూ.1,40,000 పే స్కేల్ మధ్య వేతనాలు ఉంటాయి.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆర్‌ఎఫ్‌సిఎల్‌ వెబ్‌ సైట్ https://www.rfcl.co.in కెరీర్స్‌ విభాగంలో పూర్తి వివరాలను చూడవచ్చు.మార్చి 1 నుంచి నోటిఫికేషన్ అందుబాటులోకి రానుంది. మార్చి 31 వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆర్‌ఎఫ్‌సిఎల్‌ అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తారు. నోటిఫికేషన్ సవరణ, అనుబంధ నోటిఫికేషన్, మార్పుల గురించి వెబ్‌సైట్‌ను మాత్రమే అనుసరించాలని ఆర్‌ఎఫ్‌సిఎల్ పేర్కొంది.