AIIMS Nursing Officers: ఎయిమ్స్‌లో నర్సింగ్ ఆఫీసర్స్ ఉద్యోగాలు.. మార్చి 17 వరకు దరఖాస్తుల స్వీకరణ
AIIMS Nursing Officers: ఎయిమ్స్ ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ కేంద్రాల్లో నర్సింగ్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాత పరీక్ష Written Test ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
AIIMS Nursing Officers: దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ కేంద్రాల్లో నర్సింగ్ ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ -6 నోటిఫికేష్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఢిల్లీ ఎయిమ్స్‌తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ కేంద్రాల్లో నర్సింగ్ ఆఫీసర్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. రాత పరీక్ష ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
నార్‌సెట్-6 ద్వారా ఎయిమ్స్ భటిండా, ఎయిమ్స్ భువనేశ్వర్, ఎయిమ్స్ బిలాస్‌పూర్, ఎయిమ్స్ దేవ్‌ఘర్, ఎయిమ్స్ గోరఖ్‌పూర్, ఎయిమ్స్ గువాహటి, ఎయిమ్స్ కళ్యాణి, ఎయిమ్స్ మంగళగిరి, ఎయిమ్స్ నాగ్‌పూర్, ఎయిమ్స్ రాయ్‌బరేలీ, ఎయిమ్స్ ఢిల్లీ, ఎయిమ్స్ పట్నా, ఎయిమ్స్ రాయ్‌పూర్, ఎయిమ్స్ విజయ్‌పూర్‌లలో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
విద్యార్హతలు....
ఎయిమ్స్ నర్సింగ్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు జిఎన్‌ఎం డిప్లొమాతో పాటు రెండేళ్ల అనుభవం లేదా బిఎస్సీ ఆనర్స్ నర్సింగ్, బిఎస్సీ నర్సింగ్, బిఎస్సీ పోస్ట్ బేసిక్ నర్సింగ్‌లలో ఉత్తీర్ణత సాధించాలి. దీంతో పాటు స్టేట్ కౌన్సిల్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో సభ్యులై ఉండాలి.
దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 30ఏళ్లలోపు ఉండాలి. నార్ సెట్ లో అర్హత సాధించిన వారికి రూ.9300-34,800 వేతన శ్రేణి మధ్య జీతం లభిస్తుంది. దీంతో పాటు రూ.4వేల గ్రేడ్ పే చెల్లిస్తారు.
నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.3వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2400, దివ్యాంగులకు మినహాయింపునిస్తారు.
ఉద్యోగాలను నార్‌సెట్-6 ద్వారా భర్తీ చేస్తారు. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షల ద్వారా అపాయింట్‌మెంట్ ఇస్తారు.
నార్‌సెట్ -6 కోసం దరఖాస్తు చేయడానికి 2024 మార్చి 17వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు https://www.aiimsexams.ac.in లో చూడవచ్చు.
నార్‌సెట్ దరఖాస్తు చేసుకోడానికి 30ఏళ్ల వయో పరిమితి విధించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గరిష్ట వయసులో ఐదేళ్ల సడలింపు ఇస్తారు. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఇస్తారు. ఎక్స్ సర్వీస్ మెన్‌కు ఐదేళ్లు సడలింపు ఇస్తారు. పూర్తి వివరాలు నోటిఫికేషన్ డాక్యుమెంట్‌లో ఉన్నాయి.