AP Heat Wave : చాగలమర్రిలో ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రత నమోదు-రేపు 58 మండలాల్లో తీవ్రవడగాల్పులు
AP Heat Wave : ఏపీలో ఎండలు ఠారెత్తున్నాయి. ఎండ వేడిమి, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇవాళ.. ఈ ఏడాదిలో అత్యధిక ఉష్ణోగ్రత(45.9°C) నమోదు అయ్యింది.
AP Heat Wave : ఏపీలో ఎండలు(AP Temperatures) తీవ్రంగా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటిపోయాయి. రేపు(ఏప్రిల్ 28) 58 మండలాల్లో తీవ్రవడగాల్పులు(Severe Heat Wave), 148 మండలాల్లో వడగాల్పులు(Heat Wave) వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఎల్లుండి(ఏప్రిల్ 29) 51 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 111 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు చెప్పారు.
రేపు తీవ్రవడగాల్పులు వీచే మండలాలు(58)
- శ్రీకాకుళం జిల్లా- 17
- విజయనగరం జిల్లా - 21
- పార్వతీపురం మన్యం జిల్లా -12
- అల్లూరి జిల్లా - 6
- ఏలూరు జిల్లా - 1
- తూర్పుగోదావరి జిల్లా- 1
రేపు వడగాల్పులు వీచే మండలాలు(148)
శ్రీకాకుళం 12, విజయనగరం 5, పార్వతీపురంమన్యం 3, అల్లూరి సీతారామరాజు 7, విశాఖపట్నం 3, అనకాపల్లి 18, కాకినాడ 14, కోనసీమ 8, తూర్పుగోదావరి 18, పశ్చిమగోదావరి 3, ఏలూరు 10, కృష్ణా 5, ఎన్టీఆర్ 5, గుంటూరు 6, పల్నాడు 11, ప్రకాశం 12, పొట్టిశ్రీరాములు నెల్లూరు 1, సత్యసాయి 3, అన్నమయ్య 1, తిరుపతి 3 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ప్రకటించారు.
వడగాల్పులు వీచే మండలాల పూర్తి వివరాలు ఈ లింక్ లో తెలుసుకోవచ్చు
ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రత ఇదే
శనివారం నంద్యాల(Nandyal) జిల్లా చాగలమర్రి(Chagalamarri)లో 45.9°C(ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రత) తిరుపతి జిల్లా రేణిగుంటలో 45.7°C, వైయస్సార్ జిల్లా ఖాజీపేట, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 45.2°C, విజయనగరం జిల్లా గజపతినగరం, కర్నూలు జిల్లా కోడుమూరులో 44.8°C, అనంతపురం జిల్లా తాడిపత్రిలో 44.4°C, శ్రీకాకుళం జిల్లా బూర్జ, పల్నాడు జిల్లా మాచెర్లలో 44.2°C, ఏలూరు జిల్లా దెందులూరులో 44.1°C, అన్నమయ్య జిల్లా పెద్దమండ్యంలో 44°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 77 మండలాల్లో తీవ్రవడగాల్పులు(Severe Heat Wave), 98 మండలాల్లో వడగాల్పులు వీచాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఈ సమయాల్లో బయటకు రావొద్దు
ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచించారు. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. డీహైడ్రేట్(Dehydration) కాకుండా ఉండటానికి ORS, ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తాగాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు.
సంబంధిత కథనం