Nandyal Crime : నంద్యాల జిల్లాలో విషాదం, విషం తాగి బిడ్డకు పాలిచ్చిన తల్లి
Nandyal Crime : నంద్యాల జిల్లాలో ఓ మహిళ విషం తాగి ఆత్మహత్యకు చేసుకుంది. అయితే విషం తాగిన మహిళ తన బిడ్డకు పాలు ఇచ్చింది. దీంతో ఆ చిన్నారి సైతం మరణించింది.
Nandyal Crime : నంద్యాల జిల్లాలో(Nandyal) విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని శిరివెళ్ల మండలం ఎర్రగుంట్లలో ఓ మహిళ విషం(Poison) తాగి బిడ్డకు పాలు ఇచ్చింది. ఈ ఘటనలో ఇద్దరూ మృతి చెందారు. ఆ మహిళ మానసిక పరిస్థితి సరిగాలేదని స్థానికులు అంటున్నారు. హిందూమతి(26) అనే మహిళ బుధవారం కల్లాపి పౌడర్ తాగింది. అనంతరం బిడ్డ ఏడుస్తుందని పాలు ఇచ్చింది. కాసేపటికే ఇద్దరూ మరణించారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి విరాలు తెలియాల్సి ఉంది.
మూడేళ్ల చిన్నారి గొంతు కోసిన తండ్రి
కన్న తండ్రి కాలయముడిగా మారాడు. మూడేళ్ల చిన్నారి గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా(Kurnool) కోసిగి మండలంలో చోటుచేసుకుంది. కోసిగి మండలం జంపాపురంలో మూడేళ్ల చిన్నారిని కసాయి తండ్రి శాంతి కుమార్ గొంతు కోసి హత్య చేశాడు. బుధవారం తెల్లవారు జూమున తల్లి పక్కన నిద్రిపోతున్న చిన్నారి గొంతును బ్లేడుతో కోసి హత్యచేశాడు. శాంతి కుమార్ సొంతూరు మంత్రాలయం మండలం కగ్గళ్లు. అతడు తన భార్య ఊరు జంపాపురానికి ఇల్లరికం వెళ్లాడు. మద్యానికి బానిసైన శాంతి కుమార్ డబ్బులు కోసం భార్యను వేధించేవాడు. దీంతో వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. తాజాగా తన మూడేళ్ల చిన్నారిని అతి దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణంపై(Crime News) భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటనాస్థిలిని పరిశీలించిన పోలీసులు.... శాంతి కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
పాలలో విషం కలిపి చిన్నారులతో తాగించిన తల్లిదండ్రులు
మహబూబాబాద్ జిల్లాలో (Mahabubabad)ఇటీవల దారుణం జరిగింది. పురుగుల మందు కలిపిన పాలు తాగి, ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా.. వారి తల్లిదండ్రులు అదృశ్యం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. గార్ల మండలం సీతంపేట గ్రామ పంచాయతీ పరిధి అంకన్నగూడెం లో ఈ ఘటన జరగగా.. ముక్కు పచ్చలారని ఇద్దరు చిన్నారుల మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. అంకన్న గూడెం గ్రామానికి చెందిన పెండకట్ల అనిల్ కు బయ్యారం మండలం నామాలపాడులోని రాయికుంటకు చెందిన దేవితో దాదాపు ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. వ్యవసాయంతో పాటు ఇటుక బట్టీల్లో పని చేసే అనిల్ తన అత్తగారి గ్రామమైన రాయకుంటలోనే కొద్దిరోజులుగా నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. వీరికి లోహిత(3), జశ్విత(1) అనే ఇద్దరు చిన్నారులు సంతానంగా ఉన్నారు. అనిల్-దేవీ దంపతులు తమ ఇద్దరు చిన్నారులను తీసుకొని రాయికుంట నుంచి అంకన్నగూడెం వచ్చారు.
అనిల్ తండ్రి వెంకన్న అంకన్న గూడెంలో చిన్నపాటి కిరాణ షాప్ నడుపుతున్నారు. ఇంటికి కొడుకు, కోడలితో పాటు ఇద్దరు మనువరాళ్లు రాగా.. వెంకన్న రోజువారీలాగే ఆదివారం తెల్లవారుజామునే దుకాణం తెరిచేందుకు వెళ్లాడు. ఆయన వెళ్తున్న సమయంలో ఇంట్లో అందరూ ఉండగా ఇంటికి వచ్చేసరికి ఇంట్లో కొడుకు అనిల్, కోడలు దేవి కనిపించలేదు. దీంతో వారి కోసం వెతుకుతుండగా లోహిత, జశ్విత ఇద్దరూ విగతాజీవులుగా కనిపించారు. అది చూసి కంగు తిన్న వెంకన్నకు ఏం చేయాలో తోచలేదు. ఇద్దరు మనువరాళ్లు ప్రాణాలు కోల్పోయి అచేతన స్థితిలో పడి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
సంబంధిత కథనం