AP ECET 2023 : ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల - ముఖ్య తేదీలివే-ap ecet counselling schedule released 2023 check key dates are here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ecet 2023 : ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల - ముఖ్య తేదీలివే

AP ECET 2023 : ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల - ముఖ్య తేదీలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 07, 2023 02:26 PM IST

AP ECET 2023: ఏపీఈసెట్ 2023 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ముఖ్య తేదీలను వెల్లడించారు అధికారులు.

ఏపీఈసెట్ 2023 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల
ఏపీఈసెట్ 2023 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల

AP ECET 2023 Counselling Updates: రెండో సంవత్సరం ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీఈసెట్ 2023 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదైలంది. ఈ మేరకు ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి శుక్రవారం ప్రకటన విడుదల చేసారు. జులై పదవ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈసెట్ 2023లో అర్హత సాధించిన విద్యార్ధులకు ఏపీ ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ , ప్రాసెసింగ్ రుసుము చెల్లింపు కోసం జులై 14 నుండి 17వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు అవకాశం ఉంటుంది. ధ్రువీకరణ పత్రాల వెరిఫికేషన్ కోసం జులై 17 నుంచి 20వ తేదీ వరకు నిర్దేశించారు. విద్యార్ధులు ఆప్షన్ల ఎంపిక కోసం 19 నుండి 21 వరకు మూడు రోజులు కేటాయించారు. ఆప్షన్ల మార్పు కోసం 22వ తేదీని సూచించగా... జులై 25వ తేదీన సీట్ల కేటాయింపు చేస్తామని నాగరాణి వివరించారు.

ధ్రువీకరణ పత్రాల నిర్ధారణ, కౌన్సిలింగ్ ప్రక్రియ తదితర అంశాల కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో 14 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసామని కన్వీనర్ తెలిపారు. ఆన్ లైన్ లో ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ కు నమోదైన విద్యార్ధులకు సహాయ కేంద్రాల వివరాలు అందుబాటులో ఉంటాయన్నారు. ధృవీకరణ పత్రాల నిర్ధారణ కోసం విద్యార్ధులు ఏపీ ఈసెట్ ర్యాంకు కార్డు, హాల్ టిక్కెట్… పదవతరగతి ఉత్తీర్ణత పత్రం, డిప్లమో మార్కుల జాబితా, ప్రోవిజినల్ సర్జిఫికెట్, ఏడవ తరగతి నుండి డిప్లమో వరకు స్టడీ సర్టిఫికేట్, టిసి, ట్యూషన్ ఫీజు రిఎంబర్స్ మెంట్ కోరుకునే అభ్యర్ధులు 2020 జనవరి ఒకటవ తేదీ తరువాత జారీ చేసిన అదాయ దృవీకరణ పత్రం, వివిధ రిజర్వేషన్లకు అవసరమైన ధృవీకరణ పత్రాలు , లోకల్ స్టేటస్ కోసం రెసిడెన్షియల్ సర్జిఫికెట్, ఈడబ్ల్యుఎస్ దృవీకరణ తదితర పత్రాలు సిద్దం చేసుకోవాలన్నారు.

ఈ సంవత్సరం ఈసెట్ కోసం 38,181 మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు 34,503 మంది విద్యార్ధులు హాజరయ్యారు. 92 శాతంతో 31,933 మంది అర్హత సాధించారు. నిబంధనల ప్రకారం క్రీడలు, వికలాంగులు, సాయిధ దళాల ఉద్యోగుల పిల్లలు, ఎన్ సిసి, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలకు రిజర్వేషన్లు వర్తిస్తాయని ఈసెట్ కన్వీనర్ , సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు. సీట్లు పొందిన విద్యార్ధులు జులై 25 నుండి 30వ తేదీ వరకు ఐదు రోజులలోపు అయా కళాశాలల్లో వ్యక్తిగతంగా రిపోర్జు చేయాలని తరగతులు ఆగస్టు 1వ తేదీ నుండి ప్రారంభం అవుతాయని వివరించారు. మరింత సమాచారం కోసం మంగళగిరి, సాంకేతిక విద్యాశాఖ కార్యాలయం ఆవరణలోని ఎపి ఈసెట్ కన్వీనర్ కార్యాలయాన్ని సందర్శించవచ్చన్నారు. 7995681678, 7995865456, 9177927677 ఫోన్ నెంబర్ల ద్వారా సహాయ కేంద్రాల అధికారులతో కార్యాలయ పనివేళలలో సంప్రదించవచ్చని నాగరాణి పేర్కొన్నారు

Whats_app_banner