ఏపీ ఈసెట్ - 2025 కౌన్సెలింగ్ అప్డేట్ : ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం - ముఖ్య తేదీలివే
ఏపీ ఈసెట్ - 2025 కౌన్సెలింగ్ ప్రక్రియపై కీలక అప్డేట్ వచ్చేసింది. ఇవాళ్టి నుంచి ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. జూలై 20 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. జూలై 22వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది.