AP ECET 2023 Results : ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి!
AP ECET 2023 Results : ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. అభ్యర్థులు ఈసెట్అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
AP ECET 2023 Results : ఆంధ్రప్రదేశ్ ఈసెట్(AP ECET-2023) ఫలితాలు ఆదివారం(జులై 2) విడుదల అయ్యాయి. ఈసెట్ పరీక్షను జూన్ 20వ తేదీన నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 103 పరీక్షా కేంద్రాలు, హైదరాబాద్‌లో రెండు కేంద్రాలలో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 38,255 మంది దరఖాస్తు చేసుకోగా... 28,640 మంది బాలురు, 9,615 మంది బాలికలు ఉన్నారు. ఏపీ ఈసెట్ ఫలితాలను https://cets.apsche.ap.gov.in/ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. పాలిటెక్నిక్, బీఎస్సీ (మ్యాథ్స్) ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా ఇంజినీరింగ్ (బీఈ, బీటెక్, బీఫార్మసీ) రెండో సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి ఈసెట్ పరీక్షను నిర్వహించారు.
ఏపీ ఈసెట్ ప్రిలిమినరీ ఆన్సర్ కీ జూన్ 23న విడుదల చేశారు. ఈసెట్ ఫలితాలను ర్యాంక్‌లు, మార్కులు రూపంలో విడుదల చేస్తారు. అభ్యర్థులు బ్రాంచ్-నిర్దిష్ట ర్యాంక్ లేదా టోటల్ ర్యాంక్ ద్వారా అడ్మిషన్ పొందుతారు. ఏపీ ఈసెట్ కౌన్సెలింగ్ జులై రెండో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆగస్టు మొదటి వారంలో తరగతులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. కౌన్సెలింగ్ కు ముందు అభ్యర్థులు తప్పనిసరిగా విద్యార్హత సర్టిఫికెట్లు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కేటగిరీ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్ వంటి అవసరమైన పత్రాలను సిద్ధంగా చేసుకోవాలి.
అభ్యర్థులు తమ మార్కులను తనిఖీ చేయడానికి cets.apsche.ap.gov.in/ECET వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. అభ్యర్థులు ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు.
Step 1: అభ్యర్థులు ముందుగా ఏపీ ఈసెట్ అధికారిక వెబ్ సైట్ పై క్లిక్ చేయండి. :
Step 2: వెబ్ సైట్ లో ECET ఫలితాల లింక్‌ను తెరవండి.
Step 3: మీ లాగిన్ ఆధారాలను నమోదు చేయండి.
Step 4: మీ ఫలితాన్ని తనిఖీ చేసి, డౌన్‌లోడ్ చేసుకోండి.
APSCHE తరపున కాకినాడలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ నిర్వహించే ప్రవేశ పరీక్ష ఏపీ ఈసెట్. ఇంజినీరింగ్, టెక్నాలజీ, B.Sc డిప్లొమా హోల్డర్‌ల కోసం ఇంజినీరింగ్/ఫార్మసీ కోర్సులలో రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీలో ప్రవేశం కోసం ఈ పరీక్ష నిర్వహించారు. ఏపీ ఈసెట్ ఫలితాలు ప్రకటన తర్వాత, అధికారులు మెరిట్ జాబితాను కంపైల్ చేసి, అభ్యర్థులకు అందుబాటులో ఉంచుతారు. ఈ మెరిట్ జాబితా కౌన్సెలింగ్, ప్రవేశ ప్రాధాన్యత కోసం అర్హతను నిర్ణయిస్తుంది. AP ECET 2023 పరీక్షలో దరఖాస్తుదారుల స్కోర్లు లేదా మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు.