AP Agriculture Budget 2024-25 : అన్నదాతకు దన్నుగా.. రూ.43,402 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్
AP Agriculture Budget 2024-25 : ఏపీ రైతన్నల కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. రూ.43,402 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్‌ను అసెంబ్లీ ముందుంచారు. దేవదాయశాఖ కోసం కూడా బడ్జెట్‌లో భారీగా నిధుల కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు అచ్చెన్నాయుడు. రూ.43,402 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్‌ను రూపొందించారు. వ్యవసాయ బడ్దెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
'ఏపీ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం.. వ్యవసాయానికి నిర్దిష్టమైన ప్రణాళిక అవసరం. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా పనిచేస్తున్నాం. వ్యవసాయం ఆధారంగా 62శాతం జనాభా జీవిస్తున్నారు. గత ప్రభుత్వం రైతులను మోసం చేసింది. రైతులకు పంట బీమా అందించలేదు. పెట్టుబడి సాయం పెంచి నెలరోజుల్లోనే అందించాం. వడ్డీలేని రుణాలు, భూసార పరీక్షలకు ప్రాధాన్యత ఇస్తాం. రిమోట్ సెన్సింగ్ సాంకేతికతతో భూసార పరీక్షలు చేపడతాం. మట్టి నమూనాల కోసం ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తాం. సాగుకు సూక్ష్మపోషకాలు అందిస్తాం' అని అచ్చెన్నాయుడు వివరించారు.
దేవదాయ శాఖ కోసం బడ్జెట్‌లో భారీగా నిధుల కేటాయింపు జరిగింది. 6 వేల దేవాలయాల్లో ధూప, దీప, నైవేద్యాల కోసం.. రూ.5 వేల నుంచి రూ.10 వేలు కేటాయించారు. అర్చకుల వేతనం రూ.10 నుంచి రూ.15 వేలకు పెంచారు. వేద విద్య చదువుకున్న నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇస్తామని ప్రకటించారు. కృష్ణా, గోదావరి సంగమం దగ్గర జలహారతుల పునరుద్ధరణకు ప్రతిపాదించారు. 160 దేవాలయాల ఆధునీకరణ పనులకు రూ.113 కోట్లు కేటాయించారు.
బడ్జెట్ కేటాయింపులు ఇలా..
జలవనరులు-రూ.16,705 కోట్లు
వ్యవసాయశాఖ-రూ.11,855 కోట్లు
వైద్యారోగ్యశాఖ-రూ.18,421 కోట్లు
పాఠశాల విద్య-రూ.29,909 కోట్లు
ఉన్నత విద్య-రూ.2,326 కోట్లు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి-రూ.16,739 కోట్లు
పురపాలక, పట్టణాభివృద్ధి-రూ.11,490 కోట్లు
గృహనిర్మాణం-రూ.4012 కోట్లు
పోలీస్‌శాఖ-రూ.8,495 కోట్లు
బీసీ వెల్ఫేర్-రూ.39,007 కోట్లు
ఎస్సీ సంక్షేమం-రూ.18,497
ఎస్టీ సంక్షేమం-రూ.7,557
మైనార్టీ సంక్షేమం-రూ.4,376 కోట్లు
మహిళాశిశు సంక్షేమశాఖ-రూ.4,285 కోట్లు
రోడ్డు, భవనాలశాఖ-రూ.9,554 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్యశాఖ-రూ.3,127 కోట్లు
ఇంధనశాఖ-రూ.8,207 కోట్లు
స్కిల్ డెవలప్‌మెంట్-రూ.1,215 కోట్లు
యువజన, పర్యాటక, సాంస్కృతికశాఖ-రూ.322 కోట్లు
పర్యావరణ, అటవీశాఖ-రూ.687 కోట్లు
189 కి.మీ. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం
ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాకోసం 3శాతం రిజర్వేషన్