AP IAS Transfers : ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు-శ్రీలక్ష్మి, రజత్ భార్గవ, ప్రవీణ్ ప్రకాశ్ జీఏడీకి అటాచ్
AP IAS Transfers : ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన శ్రీలక్ష్మి, ప్రవీణ్ ప్రకాశ్, రజత్ భార్గవ, మురళీధర్ రెడ్డిలను జీఏడీకి అటాచ్ చేశారు.
AP IAS Transfers : ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్రంలోని కీలక శాఖల్లో పనిచేస్తోన్న ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తున్నట్లు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులపై వేటు పడింది. వారిని జీఏడీ అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, మురళీధర్ రెడ్డిలను జీఏడీలో రిపోర్టు చేయాలని సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఐఏఎస్ ల బదిలీలు
- జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్
- పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా శశిభూషణ్ కుమార్
- వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్
- కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది
- పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్
- పౌరసరఫరాలశాఖ కమిషనర్ గా సిద్ధార్థ్ జైన్
- ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్
- నైపుణ్యాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శిగా సౌరభ్ గౌర్ కు అదనపు బాధ్యతలు
- పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్
- ఐటీ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా కోన శశిధర్ కు పూర్తి అదనపు బాధ్యతలు
- ఉద్యాన, మత్స్యశాఖ సహకార విభాగాల కార్యదర్శిగా ఎ.బాబు
- ఏపీ సీఆర్డీఏ కమిషనర్ గా కాటమనేని భాస్కర్
- ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్న
- ఆర్థికశాఖ వ్యయ విభాగం కార్యదర్శిగా ఎం.జానకి
- పశుసంవర్థకశాఖ కార్యదర్శిగా ఎం.ఎం.నాయక్
- గనులశాఖ కమిషనర్, డైరెక్టర్ గా ప్రవీణ్ కుమార్
- ఏపీఎండీసీ ఎండీగా ప్రవీణ్ కుమార్ కు అదనపు బాధ్యతలు
- తిరుపతి జేసీకి జిల్లా కలెక్టర్ గా పూర్తి అదనపు బాధ్యతలు
- ఆర్థికశాఖ కార్యదర్శిగా వి.వినయ్ చంద్
గత వైసీపీ ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, ప్రవీణ్ ప్రకాశ్, రజత్ భార్గవ కీలకంగా వ్యవహరించారు. నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ పెద్దలు చెప్పిన విధంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించారని టీడీపీ నేతలు ఆరోపణలు చేసిన సందర్భాలూ ఉన్నాయి. దీంతో కూటమి ప్రభుత్వం వారిని ఆ శాఖల నుంచి తప్పించి జీఏడీకి అటాచ్ చేసింది.
పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ గా పనిచేసిన శ్రీలక్ష్మికి ఇటీవల పలు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. మంత్రి నారాయణ బాధ్యతల స్వీకరణ సందర్భంగా చేదు అనుభవం ఎదురైంది. శ్రీలక్ష్మి తెచ్చిన ఫైల్ పై సంతకం పెట్టేందుకు మంత్రి నారాయణ నిరాకరించారు. ఇప్పుడు ఫైళ్లపై సంతకాల వంటివేం వద్దని వారించారు. శ్రీలక్ష్మి తెచ్చిన ఫైల్ ను తిప్పి పంపారు. శ్రీలక్ష్మిని తన పేషీ నుంచి బయటకు పంపారు సీఎం చంద్రబాబు. శ్రీలక్ష్మి నుంచి బొకే తీసుకోవడానికి చంద్రబాబు నిరాకరించారు. జీవోలపై శ్రీలక్ష్మి సంతకాలు ఉండకూడదని ప్రభుత్వ పెద్దలు సైతం ఆదేశించారు. శ్రీలక్ష్మిని బదిలీ చేసేవరకు ఆమెకు ఫైళ్లు పంపకూడదని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమెను సీఎస్ బదిలీ చేశారు. శ్రీలక్ష్మి పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్టు చేయాలని సూచించారు.
సంబంధిత కథనం