Telangana Govt : భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు - ఈ జిల్లాలకు కొత్త కలెక్టర్లు, ప్రభుత్వం ఉత్తర్వులు-several ias officers transferred in telangana read full list here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Govt : భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు - ఈ జిల్లాలకు కొత్త కలెక్టర్లు, ప్రభుత్వం ఉత్తర్వులు

Telangana Govt : భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు - ఈ జిల్లాలకు కొత్త కలెక్టర్లు, ప్రభుత్వం ఉత్తర్వులు

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 15, 2024 01:10 PM IST

IAS Transfers in Telangana : రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఐఎఎస్ అధికారుల బదిలీలు
ఐఎఎస్ అధికారుల బదిలీలు

IAS Transfers in Telangana : తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పని చేస్తున్న పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. మొత్తం 20 మంది అధికారులు బదిలీ అయ్యారు. ఇందులో ఎక్కువగా కలెక్టర్లు ఉన్నారు.

  • మంచిర్యాల జిల్లా కలెక్టర్ గా ఉన్న బడావత్ సంతోష్ ను నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు.
  • సందీప్ కుమార్ ఝా - రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు.
  • అశిష్ సంగ్వాన్ - కామారెడ్డి జిల్లా కలెక్టర్ గా నియామకం.
  • వీ. పాటిల్ - భదాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా నియామకం.
  • రాహుల్ శర్మ - భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా నియామకం.
  • సిక్తా పట్నాయక్ - హన్మకొండ కలెకర్ట్ గా ఉండగా...నారాయణపేట జిల్లా కలెక్టర్ గా నియమించారు.
  • శ్రీ హర్ష - పెద్దప్లలి జిల్లా కలెక్టర్ గా నియామకం.
  • ప్రావీణ్య - వరంగల్ జిల్లా కలెక్టర్ గా ఉండగా... హన్మకొండ కలెక్టర్ గా నియామకం.
  • బీ సత్యప్రసాద్ - జగిత్యాల జిల్లా కలెక్టర్ గా నియామకం.
  • విజేంద్ర - మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గా నియామకం.
  • కుమార్ దీపక్ - మంచిర్యాల జిల్లా కలెక్టర్ గా నియామకం.
  • ప్రతీక్ జైన్ - వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా నియామకం.
  • నారాయణ రెడ్డి - నల్గొండ కలెక్టర్ గా నియామకం.
  • ఆదర్శ సురభీ - వనపర్తి జిల్లా కలెక్టర్ గా నియామకం.
  • శారదా దేవీ - వరంగల్ జిల్లా కలెక్టర్ గా నియామకం.
  • అభినవ్ - నిర్మల్ కలెక్టర్ గా నియామకం.

Whats_app_banner