AP SSC Supply Results 2024 : ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, ఈ లింక్ లో చెక్ చేసుకోండి
AP SSC Supply Results 2024 : ఏపీ పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యార్థులు ఫలితాలను ఎస్ఎస్సీ బోర్డు వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
AP SSC Supply Results 2024 : ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల అయ్యాయి. ఎస్.ఎస్.సి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://bse.ap.gov.in/ లో విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. ఎస్ఎస్సీ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 24 నుంచి జూన్ 10 వరకు నిర్వహించారు. జూన్ 6 నుంచి 9 వరు 24 క్యాంపులలో జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహించారు. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో రాష్ట్ర వ్యాప్తంగా 62.21 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని బోర్డు ప్రకటించింది. ఇందులో బాలుర ఉత్తీర్ణత 59.99 శాతం కాగా బాలికల ఉత్తీర్ణత 65.96 శాతంగా ఉంది.
రాష్ట్రంలో ప్రకాశం జిల్లా అత్యధిక ఉత్తీర్ణత శాతం 96.15% సాధించగా, కర్నూలు జిల్లా 30.60% అత్యల్ప ఉత్తీర్ణత శాతం సాధించింది. ఎస్ఎస్సీ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 1,07,883 మంది విద్యార్థులు హాజరవ్వగా 62.21 శాతంతో 67115 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలు విడుదలైన నాలుగు రోజుల తర్వాత మార్కుల జాబితాలను అధికారిక వెబ్ సైట్ https://www.bse.ap.gov.in/ లో అందుబాటులో ఉంచనున్నారు. హెడ్ మాస్టర్ లాగిన్ నుంచి స్కూల్ వారీగా మార్కుల మెమోరాండం, మార్క్స్ మెమోలను డౌన్ లోడ్ చేసుకోవచ్చని బోర్డు తెలిపింది. విద్యార్థులు నేరుగా https://www.results.bse.ap.gov.in/ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చని, షార్ట్ మెమోలు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఉత్తీర్ణులైన విద్యార్థుల ఎస్ఎస్సీ సర్టిఫికెట్లను సంబంధిత పాఠశాలలకు పంపుతామని పేర్కొంది. నిర్దిష్ట సమాచారం కోసం కొంత మంది విద్యార్థుల ఫలితాలు నిలిపివేసినట్లు బోర్డు పేర్కొంది. అటువంటి విద్యార్థుల ఫలితాలు త్వరలో విడుదల చేస్తామని తెలిపింది.
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్
విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్ఎస్సీ బోర్డు తెలిపింది. జూన్ 27 నుంచి జులై 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఆఫ్ లైన్ ప్రక్రియ లేదని స్పష్టం చేసింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు వెంటనే సంబంధిత స్కూల్ హెచ్ఎమ్ ను సంప్రదించి, దరఖాస్తు ఫీజు చెల్లించాలని అధికారులు తెలిపారు. ప్రతి సబ్జెక్టు జవాబు పత్రం రీకౌంటింగ్ కోసం దరఖాస్తు రుసుము రూ.500, ప్రతి సబ్జెక్ట్ జవాబు స్క్రిప్ట్ రీవెరిఫికేషన్ కోసం రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఏపీ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
ఏపీ ఇంటర్ ఫస్టియర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ బుధవారం సాయంత్రం 4.00 గంటలకు సచివాలయంలో విడుదల చేశారు. https://resultsbie.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. సప్లిమెంటరీలో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.40 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు.