SSC GD Constable 2024 Key : ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ ప్రాథమిక కీ విడుదల, ఇలా చెక్ చేసుకోండి!-ssc gd constable 2024 answer key response sheets released candidates check ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ssc Gd Constable 2024 Key : ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ ప్రాథమిక కీ విడుదల, ఇలా చెక్ చేసుకోండి!

SSC GD Constable 2024 Key : ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ ప్రాథమిక కీ విడుదల, ఇలా చెక్ చేసుకోండి!

Published Apr 03, 2024 10:39 PM IST Bandaru Satyaprasad
Published Apr 03, 2024 10:39 PM IST

  • SSC GD Constable 2024 Key : స్టాఫ్ సెలక్షన్ కమీషన్(SSC) జీడీ కానిస్టేబుల్ ప్రాథమిక కీని బుధవారం విడుదల చేసింది. అస్సాం రైఫిల్స్ రిక్రూట్‌మెంట్ పరీక్షలో సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF), ఎస్ఎస్ఎఫ్, రైఫిల్‌మ్యాన్ (GD) కానిస్టేబుల్ పరీక్ష కీ ఎస్ఎస్సీ అధికారిక వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచింది.

స్టాఫ్ సెలక్షన్ కమీషన్(SSC) జీడీ కానిస్టేబుల్ ప్రాథమిక కీని బుధవారం విడుదల చేసింది. అస్సాం రైఫిల్స్ రిక్రూట్‌మెంట్ పరీక్షలో సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF), ఎస్ఎస్ఎఫ్, రైఫిల్‌మ్యాన్ (GD) కానిస్టేబుల్ పరీక్ష కీ ఎస్ఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ssc.gov.inలో అందుబాటులో ఉంచింది.  ఈ లింక్ లో ssc.digialm.com/EForms/configuredHtml/2207/87626/login.html ప్రాథమిక కీ చెక్ చేసుకోవచ్చు. 

(1 / 6)

ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ కీ పై అభ్యర్థులు లేవనెత్తాలనుకునే అభ్యర్థనలు నిర్ణీత గడువులోగా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి అప్లై చేసుకోవచ్చని తెలిపింది. ఏప్రిల్ చివరి వారంలో లేదా మే నెలలో తుది కీ విడుదల చేయనున్నారు.  

(2 / 6)

ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 26,146 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 6,174 బీఎస్ఎఫ్ పోస్టులు, 11,025 సీఐఎస్ఎఫ్ పోస్టులు, 3,337 సీఆర్పీఎఫ్, 635 ఎస్ఎస్బీ, 3,189 ఐటీబీపీ కానిస్టేబుల్ పోస్టులు, 1,490 ఏఆర్, 296 ఎస్ఎస్ఎఫ్ పోస్టులు ఉన్నాయి.

(3 / 6)

ఎస్ఎస్సీ కానిస్టేబుల్/ రైఫిల్ మ్యాన్ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహించారు. అస్సాం రైఫిల్స్‌లో సాయుధ పోలీసు బలగాలు (CAPF), ఎస్ఎస్ఎఫ్, రైఫిల్‌మ్యాన్ (GD) పోస్టులకు  ఫిబ్రవరి 20 నుంచి మార్చి 7 వరకు వివిధ సెషన్లలో పరీక్ష నిర్వహించారు. 

(4 / 6)

ప్రాథమిక కీలతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను ఎస్ఎస్సీ అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు ఎగ్జామినేషన్ రోల్ నంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అయ్యి రెస్పాన్స్ షీట్లు చెక్ చేసుకోవచ్చు. 

(5 / 6)

ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లపై(SSC GD Constable Response Sheets) అభ్యంతరాలు ఉండే ఏప్రిల్ 3వ తేదీ సాయంత్రం 06:30 నుంచి ఈ నెల 10వ తేదీ సాయంత్రం 06:30 వరకు ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. అయితే ప్రతి ప్రశ్న/సమాధానానికి రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.  అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్లను ప్రింటౌట్ తీసుకోవచ్చు. ఈ నెల 10 తర్వాత రెస్పాన్స్ షీట్లు అందుబాటులో ఉండవు. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు