TG SSC Supplementary Hall Tickets : తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!-hyderabad tg ssc supplementary exam hall ticket june 2024 release download process ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Ssc Supplementary Hall Tickets : తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!

TG SSC Supplementary Hall Tickets : తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!

TG SSC Supplementary Hall Tickets : తెలంగాణ ఎస్ఎస్సీ సప్లిమెంటరీ హాల్ టికెట్లను బోర్డు విడుదల చేసింది. ఎస్ఎస్సీ బోర్డు వెబ్ సైట్ లో ప్రధానోపాధ్యాయుల లాగిన్ ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ హాల్ టికెట్లు విడుదల

TG SSC Supplementary Hall Tickets : తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. విద్యాశాఖ శనివారం హాల్ టికెట్లను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. ఎస్ఎస్సీ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://bse.telangana.gov.in/ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రధానోపాధ్యాయుల యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ తో లాగిన్ అయ్యి స్కూల్ వారీగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

పరీక్ష రెండ్రోజుల ముందు వరకు

తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను ఇప్పటికే డైరెక్టరేట్‌ ఆఫ్ గవర్నమెంట్‌ ఎగ్జామ్స్‌ విడుదల చేసింది. జూన్‌ 3 నుంచి 13వ తేదీ వరకు అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 16 వరకు ఎస్ఎస్సీ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజులను కట్టించుకున్నారు. అయితే రూ.50 ఆలస్య రుసముతో సప్లిమెంటరీ పరీక్షల ఫీజును సంబంధిత సబ్జెక్టు పరీక్షకు రెండు రోజుల ముందు కూడా విద్యార్థులు ప్రధానోపాధ్యాయులకు చెల్లించవచ్చు. అలా ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజుల్ని చెల్లించిన వారి నామినల్ రోల్స్ జూన్ 14వ తేదీన ప్రధానోపాధ్యాయులు డీఈఓ కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది. ఆలస్య రుసుముతో పరీక్షలకు హాజరైన విద్యార్థుల నామినల్ రోల్స్‌ను డీఈఓలు జూన్‌18లోగా పంపాల్సి ఉంటుంది.

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇలా

  • జూన్‌ 3, 2024 నుంచి తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్ని నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి 12.30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
  • జూన్ 3- ఫస్ట్‌ లాంగ్వేజ్‌, కంపోజిట్‌ పేపర్ 1, కంపోజిట్ కోర్సుల పరీక్షలు(కంపోజిట్ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.50 వరకు)
  • జూన్‌ 5- సెకండ్ లాంగ్వేజ్‌
  • జూన్‌ 6 - థర్డ్‌ లాంగ్వేజ్
  • జూన్‌ 7 - మ్యాథ్స్‌
  • జూన్ 8- ఫిజికల్ సైన్స్
  • జూన్‌ 10 - బయాలజీ
  • జూన్‌ 11 - సోషల్
  • జూన్ 12 - ఓరియంటల్‌ సబ్జెక్టు పేపర్ 1( సంస్కృతం, అరబిక్)
  • జూన్ 13 - ఓరియంటల్‌ లాంగ్వేజ్‌ పేపర్ 2

తెలంగాణ ఎస్ఎస్సీ హాల్ టికెట్లు డౌన్ లోడ్ ఇలా?

Step 1 : తెలంగాణ ఎస్ఎస్సీ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://bse.telangana.gov.in/Index.aspx పై క్లిక్ చేయండి.

Step 2 : హోం పేజీలోని 'SSC ASE Examinations JUNE 2024 Hall Tickets / School NR' లింక్ పై క్లిక్ చేయండి.

Step 3 : తర్వాత పేజీలోని యూజర్ నేమ్ , పాస్ వర్డ్(ప్రధానోపాధ్యాయుల లాగిన్ వివరాలు) ఎంటర్ చేయాలి.

Step 4 : స్కూళ్ల వారీగా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలి.

2023-24 తెలంగాణ పదో తరగతి పరీక్షల్లో(మార్చి నెలలో జరిగిన) 91.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఉత్తీర్ణత సాధించిన బాలురలో 89.42శాతం, బాలికల్లో 93.23శాతం ఉత్తీర్ణులయ్యారు. బాలికల ఉత్తీర్ణత బాలురకంటే 3.81శాతం అధికంగా ఉంది. ఈ ఏడాది మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,05,813మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 4,94,207మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా, మరో 11,606 మంది విద్యార్థులు ప్రైవేట్‌గా పరీక్షలకు హాజరయ్యారు.

సంబంధిత కథనం