తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Russia-ukraine War: పవర్‌ఫుల్‍గా భావించే అమెరికా సైనిక వాహనాన్ని ధ్వంసం చేసిన రష్యా దళాలు

Russia-Ukraine War: పవర్‌ఫుల్‍గా భావించే అమెరికా సైనిక వాహనాన్ని ధ్వంసం చేసిన రష్యా దళాలు

21 November 2022, 19:19 IST

Russia-Ukraine War: ఉక్రెయిన్‍లోని డొనెట్స్క్ లో రష్యా సేనలు విరుచుకుపడ్డాయి. అమెరికాకు చెందిన శక్తివంతమైన మ్యాక్స్ ప్రో (MaxxPro) సైనిక వాహనాన్ని రష్యా దళాలు సులభంగా ధ్వంసం చేశాయి. యుద్ధానికి చెందిన ఫుటేజీల ద్వారా ఇది వెల్లడైంది. ఈ వాహనం ధ్వంసమవటంతో ఉక్రెయిన్ సైనికులు.. పరుగులు పెట్టారు. నేరుగా వచ్చే బుల్లెట్లు, క్షిపణల నుంచి ఈ మ్యాక్స్ ప్రో వాహనం రక్షణ కల్పిస్తుంది. బల్లాస్టిక్ ఆయుధాల దాడి, మైన్ బ్లాస్ట్, ఈఐడీ దాడులను తట్టుకునేలా అమెరికా ఈ మ్యాక్స్ ప్రో సైనిక వాహనాలను రూపొందించింది. అయితే రష్యా దళాలు మాత్రం ఈ వాహనాన్ని తేలిగా ధ్వంసం చేసేశాయి.