తెలుగు న్యూస్  /  Video Gallery  /  Ktr Phone Call To Bjp Leader Video Viral

KTR Viral Audio : మునుగోడు బీజేపీ నేతకు కేటీఆర్ ఫోన్!

19 October 2022, 13:55 IST

  • మునుగోడు నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత జగన్నాథానికి మంత్రి కేటీఆర్‌ ఫోన్ చేసినట్టుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిజమైన బీజేపీ నేత కాదని వాయిస్ లో ఉంది. ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి రాజగోపాల్ రెడ్డి ఏం అభివృద్ధి చేశారో మీకు తెలుసని వ్యాఖ్యాలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికలో మాకు సహకరించండని జగన్నాథంతో కేటీఆర్‌ మాట్లాడినట్లుగా బీజేపీ నేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం వైరల్ అవుతున్న వీడియోలోని ఆడియో ఫేక్ అంటున్నాయి.