తెలుగు న్యూస్  /  Video Gallery  /  Helium Balloon Landed In Vikarabad

Vikarabad Balloon : వికారాబాద్‌లో ల్యాండ్ అయింది ఇదే

07 December 2022, 17:24 IST

  • వికారాబాద్‌ శివారు ప్రాంతంలోని ఆకాశంలో కనిపించిన ఓ వింత ఆకారంతో జనం భయపడిపోయారు. ఏలియన్‌ షిప్‌ అంటూ హడలిపోయారు. దీంతో ఇదే పుకార్లు కొంతసేపటి వరకు వ్యాప్తిచెందాయి. ఆకాశంలో ఎగురుతున్న అది మొగిలిగుండ్లలోని పంటపొలాల్లో పడింది. దానిని చూసేందుకు పెద్ద ఎత్తున జనం వచ్చారు. బెలూన్ అని తెలిసి.. ఊపిరి పీల్చుకున్నారు. అది రీసెర్చ్‌ బెలూన్‌ అని శాస్త్రవేత్తలు చెప్పారు. హైదరాబాద్‌లోని నేషనల్‌ బెలూన్‌ ఫెసిలిటీ అనే సంస్థకు చెందినదిగా తెలుస్తోంది. వాతావరణాన్ని పరిశోధించడానికి పంపిన హీలియం బెలూన్‌ అంటున్నారు.