తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cm Kcr: 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం - సీఎం కేసీఆర్

CM KCR: 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం - సీఎం కేసీఆర్

01 October 2022, 17:29 IST

  • CM KCR Warangal Tour: దశాబాద్ధాల కాలం పాటు తెలంగాణ ప్రాంతం అనేక గోసలు పడిందని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. వరంగల్ లో పర్యటించిన ఆయన... ప్రతిమ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌, క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగా మారిందని వ్యాఖ్యానించారు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఐదు మాత్రమే ఉన్న ప్రభుత్వ రంగ వైద్య కళాశాలలు, ఇప్పుడు ఆ సంఖ్య 17కు చేరిందని వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి, ఎంబీబీఎస్​ సీట్లను 6500కు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. దేశంలోనే అనేక రంగాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని సీఎం పేర్కొన్నారు.  ఏ సమాజమైతే నిద్రాణవ్యవస్థలో ఉంటుందో అక్కడ చాలా దెబ్బ తినే ప్రమాదం ఉంటుందన్నారు. నాడు ఇలాగే సొంత రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ప్రాంతం వేరు పడి ఎన్నో ఇబ్బందులు పడిందన్నారు. మళ్లీ రాష్ట్రం కోసం పోరాడితే ఎంతో మంది ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ఎంతో సంపదకు భారతదేశం నిలయం అని చెప్పారు. వీడియోను చేసేందుకు లింక్ పై క్లిక్ చేయండి…….