తెలుగు న్యూస్  /  Video Gallery  /  Bjym Protest At Tspsc Office

bjym protest | ప్రశ్నపత్రం లీకేజీతో సంబంధం ఉన్నవారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి

14 March 2023, 17:06 IST

  • ప్రశ్నపత్రం లీకేజీతో సంబంధం ఉన్నవారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బీజేవైఎం కార్యకర్తలు టీఎస్‌పీఎస్సీ కార్యాలయ్యాన్ని ముట్టడించారు. గేట్ల పైకి ఎక్కి కార్యాలయం లోపలికి వెళ్లేందుకు బీజేవైఎం కార్యకర్తలు ప్రయత్నించారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ను సస్పెండ్ చేయాలంటూ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు అక్కడి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.