తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Attack On Anam : దాడికి యత్నం.. భయపడేదే లేదన్న టీడీపీ నేత ఆనం

Attack On Anam : దాడికి యత్నం.. భయపడేదే లేదన్న టీడీపీ నేత ఆనం

04 June 2023, 18:18 IST

  • TDP Leader Anam Venkata Ramana Reddy: టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డిపై దుండగులు దాడికి యత్నించారు. నెల్లూరులోని ఆర్టీఏ కార్యాలయం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు 10మంది బైక్‌లపై వచ్చి కర్రలతో దాడికి యత్నించారు. వెంటనే టీడీపీ కార్యకర్తలు ప్రతిఘటించడంతో దుండగులు అక్కడికి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై స్పందించిన ఆనం... వైసీపీని టార్గెట్ చేశారు. తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. నువ్వు పది మంది రౌడీలని పంపిస్తే, ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరని అన్నారు. వైసీపీ అక్రమాలపై తమ గొంతు వినిపిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.