తెలుగు న్యూస్  /  Video Gallery  /  Attack On Mla Rasamayi Balakishan Convoy

Attack On Rasamayi : ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాన్వాయ్‌‌పై దాడి

13 November 2022, 18:30 IST

  • మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు షాక్ తగిలింది. రసమయి కాన్వాయ్ పై కొంతమంది దాడి చేశారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు అదుపుచేసే ప్రయత్నం చేశారు. లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటన గన్నేరువరం మండలం గండ్లపల్లిలో జరిగింది. డబుల్ రోడ్డు నిర్మాణం చేయాలని యువకులు ధర్నా చేశారు. సంఘీభావం తెలిపిందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ కూడా వెళ్లారు. ఈ క్రమంలో రసమయి కాన్వాయ్ పై దాడి జరిగింది. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడిని ఎమ్మెల్యే రసమయి తీవ్రంగా ఖండించారు. నిరసన తెలిపే హక్కు ఉందని, కాంగ్రెస్ నేత కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో దొంగచాటుగా ఈ దాడి జరిగిందని విమర్శించారు.