తెలుగు న్యూస్  /  Video Gallery  /  19 Year Old Youth Died Of A Cardiac Arrest While Dancing At Function In Nirmal District

Youth Collapses While Dancing : డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి

26 February 2023, 16:04 IST

  • Youth Collapses While Dancing At Wedding: నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి(కె) గ్రామంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రిసెప్షన్‌ వేళ పాటలు, ఆటలు చేస్తూ సందడిగా ఉన్న వాతారణంలో విషాదం అలుముకుంది. డ్యాన్స్‌ చేస్తున్న 19ఏళ్ల ముత్యం అనే యువకుడు ఒక్కసారిగా కూలిపాయాడు. పడిపోయిన వెంటనే ఆపస్మారక స్థితికి చేరుకున్నాడు ముత్యం. ఇది గమనించిన పెళ్లి వారు, స్థానికులు ముత్యంకు ట్రీట్‌మెంట్ అందించేందుకు వెంటనే హుటహూటిన బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ముత్యం మృతి చెందినట్లుగా వైద్యులు వెల్లడించారు. అయితే తాజాగా హైదరాబాద్ లోని ఓ పెళ్లి వేడుకలోనూ ఇదే తరహా ఘటన జరిగింది. పాతబస్తీలోని కాలాపత్తార్‌లో ఓ వివాహ వేడుక జరిగింది. ఇందుకు మహమ్మద్ రబ్బాని అనే హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో బంధువులంతా ఉత్సాహంగా పాల్గొని పెళ్లి కుమారుడిని ముస్తాబు చేస్తున్నారు. ఇంతలో మహమ్మద్ రబ్బాని పెళ్లి కొడుకు వద్దకు వచ్చి అతడి కాళ్లకు పసుపు రాస్తుండగా నవ్వుతూ కిందకు కూర్చున్నాడు. ఒక్క క్షణంలోనే కూర్చున్న చోటే కుప్పకూలాడు. వెంటనే గమనించిన బంధువులు అతన్ని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు... రబ్బాని గుండెపోటుతో మరణించినట్లు తేల్చారు. ఇక జిమ్ చేస్తూ 24 ఏళ్ కానిస్టేబుల్ కూడా హైదరాబాద్ లో గుండెపోటుతో చనిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ తరహా మరణాలపై యువకులు ఆందోళన చెందుతున్నారు.