తెలుగు న్యూస్  /  Video Gallery  /  Ganguly On Roger Binny Says Bcci Is In Great Hands And Wished Them Good Luck

Ganguly on Roger Binny: బీసీసీఐ గొప్ప వ్యక్తుల చేతుల్లో ఉంది: గంగూలీ

18 October 2022, 19:12 IST

  • Ganguly on Roger Binny: బీసీసీఐ గొప్ప వ్యక్తుల చేతుల్లో ఉందని అన్నారు బోర్డు మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ. కొత్తగా ప్రెసిడెంట్ అయిన రోజర్‌ బిన్నీపై కూడా ఆయన స్పందించారు. రోజర్‌కు గుడ్‌లక్‌ చెబుతున్నాను. కొత్త గ్రూపు బీసీసీఐని ముందుకు తీసుకెళ్తుంది.. బీసీసీఐ గొప్ప వ్యక్తుల చేతుల్లో ఉంది.. ఇండియన్‌ క్రికెట్‌ కూడా బలంగా ఉంది అని గంగూలీ అన్నారు.
  • బీసీసీఐ 91వ వార్షిక సర్వసభ్య సమావేశం మంగళవారం (అక్టోబర్‌ 18) జరిగింది. ఇందులో బీసీసీఐ ప్రెసిడెంట్‌గా రోజర్‌ బిన్నీని ఎన్నుకున్నారు. ఈ పదవికి ఆయన ఒక్కరే నామినేషన్‌ వేయడంతో పోటీ లేకుండా అధ్యక్షుడయ్యారు. రోజర్‌ బిన్నీ 1983 వరల్డ్‌కప్‌ గెలిచిన టీమ్‌లో సభ్యుడు. ఇప్పుడు బోర్డు 36వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 
  • మరోసారి బోర్డు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని గంగూలీ భావించినా.. మిగతా సభ్యులు అందుకు అంగీకరించలేదు. దీంతో ఆయన నామినేషన్‌ వేయలేకపోయారు. ఎల్లకాలం పరిపాలకుడిగాగానీ, ప్లేయర్‌గాగానీ ఉండరని.. ఇక తాను మరింత పెద్ద పని చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు గతంలోనే గంగూలీ చెప్పారు.