తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ufa Submarine: సైలెంట్.. కానీ చాలా వైలెంట్: రష్యా నేవీలోకి పవర్‌ఫుల్‌ సబ్‍మెరైన్

Ufa submarine: సైలెంట్.. కానీ చాలా వైలెంట్: రష్యా నేవీలోకి పవర్‌ఫుల్‌ సబ్‍మెరైన్

17 November 2022, 11:39 IST

శక్తిమంతమైన జలాంతర్గామి ‘యుఫా’ (Ufa Submarine) రష్యా నావికా దళంలోకి అధికారికంగా ప్రవేశించింది. చాలా తక్కువ శబ్దంతో సముద్ర జలాల్లో ఇది దూసుకెళ్లగలిగే అతిపెద్ద మూడో జనరేషన్ సబ్‍మెరైన్ ఇది. ప్రపంచంలోనే అత్యంత నిశ్శబ్ద సబ్‍మెరైన్‍గా ఇది నిలిచింది. దీంతో సముద్రపు జలాల్లో ప్రత్యర్థులు దీన్ని గుర్తించడం కూడా కష్టం. యుఫా సబ్‍మెరైన్ ఆపరేషనల్ లోతు 240 మీటర్లుగా ఉంది. అలాగే సముద్రపు జలాల్లో గరిష్టంగా 300 మీటర్ల లోతు వరకు ఇది వెళ్లగలదు. క్యాలిబర్ మిసైల్స్ తో కూడిన ఆయుధాలు ఈ సబ్‍మెరైన్‍లో ఉంటాయి. ఆపరేషనల్ రేంజ్ 7,500 మైల్స్ వరకు ఉంటుంది. మిసైల్ ల్యాండ్ అటాక్ రేంజ్ 1,500 కిలోమీటర్ల నుంచి 2,500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంటే 2,500 కిలోమీటర్ల దూరంలో లక్ష్యంపై కూడా ఈ సబ్‍మెరైన్.. క్షిపణితో దాడి చేయగలదు. క్యాలిబర్.. అణు సామర్థ్యం ఉన్న మిసైల్.